Inter Supplementary Exams: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే...
నంద్యాల(న్యూటౌన్): మే 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి సునీత సోమవారం తెలిపారు. ఫీజు చెల్లింపునకు ఈనెల 18 నుంచి 24వ తేదీ వ రకు గడువు ఉందన్నారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇదే తేదీలో ఫీజు చెల్లించాలని తెలిపారు. జవాబు పత్రాల ఒక్కొక్క పేపర్ రీ వెరిఫికేషన్‌కు రూ.1,300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూమెంట్ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలన్నారు. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూట్‌మెంట్ రాయాలనుకునే సైన్స్ విద్యార్థులు రూ.1,440, ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,240 చొప్పున చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో విద్యార్థులు సంప్రదించాలని డీవీఈఓ తెలిపారు.
Tags
- Inter Supplementary Exams
- ap inter supplementary exams
- Inter Exams
- trending inter exams news
- Intermediate Board Exams
- Latest inter exams news
- inter students
- Intermediate
- Class 12 Exams
- Class 12 Exams 2024
- Higher secondary exams
- 10+2 exams
- 12th grade exams
- Senior secondary exams
- Inter Supplementary news
- State board exams
- Intermediate Public exams Results 2024
- inter Study materials
- exam timetable
- exam results
- Inter Supplementary Exams last date
- Inter Supplementary Exams new dates
- Today News
- Latest News Telugu
- inter exams Breaking news
- Breaking news
- Telangana News
- andhra pradesh news
- trending india news
- Re-Verification
- recounting
- sakshieducation updates