Skip to main content

Wipro Recruitments : విప్రోలో 10 నుంచి 12 వేల రిక్రూట్‌మెంట్స్‌.. త్రైమాసిక ఫ‌లితాలు ఇలా..

డిసెంబర్ త్రైమాసిక గణాంకాలను ప్రకటించిన తర్వాత ఒక కీల‌క ప్ర‌క‌ట‌నను విడుద‌ల చేసింది దేశంలోనే అతి పెద్ద ఐటీ సంస్థ‌.
Wipro to hire 10 to 12 thousand freshers   Wipro IT company hiring announcement  Wipro freshers recruitment 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏకంగా, 10 నుంచి 12 వేల మంది విద్యార్థుల‌ను నియ‌మించుకోవాల‌ని సిద్ధ‌ప‌డుతోంది దేశంలోనే నాలుగ‌వ‌ ఐటీ సంస్థ విప్రో. కంపెనీ ప్రతి త్రైమాసికంలో 2,500-3,000 'ఫ్రెషర్స్స‌ను నియ‌మిస్తూనే ఉంటుంది. వచ్చే ఏడాది కూడా కంపెనీ దేశంలోని వివిధ క్యాంపస్‌ల నుండి వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటుంది.

3260 Jobs: డిస్కంలలో 3,260 కొత్త కొలువులు.. కొలువుల వివ‌రాలు ఇలా..

త్రైమాసిక ఫ‌లితాలు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 మూడవ త్రైమాసికంలో విప్రో ఏకీకృత నికర లాభం గత సంవత్సరంతో పోలిస్తే 24.4 శాతం పెరిగి దాదాపు రూ.3,354 కోట్లకు చేరుకుంది. సమీక్షా కాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 0.5 శాతం పెరిగి దాదాపు రూ.22,319 కోట్లకు చేరుకుందని విప్రో శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన ప్రకటనలో తెలిపింది.

Army Recruitments : ఆర్మీలో 381 పోస్టులు.. ఎంపికైతే వ‌చ్చే వేత‌నం ఎంతంటే..

కంపెనీ సమాచారం ప్రకారం.. రాబోయే మార్చి త్రైమాసికానికి విప్రో తన ఐటీ సేవల వ్యాపారం నుండి 260.2 మిలియన్ డాలర్ల నుండి 265.5 మిలియన్ డాలర్ల మధ్య ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా. విప్రో కూడా ఒక్కో షేరుకు రూ.6 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.

భారీ త‌గ్గింపు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో విప్రో ఉద్యోగుల సంఖ్య 1,157 తగ్గింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 2,32,732గా ఉండగా, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 2,33,889గా, 2023-24 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో 2,39,655గా ఉంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 20 Jan 2025 01:34PM

Photo Stories