TG CPGET Results 2024: సీపీగెట్‌లో ఏడు సబ్జెక్టుల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థిని
ఆదిలాబాద్‌టౌన్: కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీలేదని నిరూపించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన శుభాంగి. పట్టణంలో ని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీజెడ్‌సీ చది వి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)లో ఏడు సబ్జెక్టులకు సంబంధించి ఉత్తమ ర్యాంకులు సాధించారు ఈమె. చాలా మంది రెండు, మూడు సబ్జెక్టుల్లో రాణించగలు గుతారు.
ఈమె మాత్రం పీజీ ఎంట్రెన్స్‌లో రాష్ట్రస్థాయిలో వృక్షశాస్త్రంలో 6వ ర్యాంక్, హిందీలో 25వ ర్యాంక్, జంతుశాస్త్రంలో 27వ ర్యాంక్, ఇంగ్లిష్‌లో 57వ ర్యాంక్, జర్నలిజంలో 107 వ ర్యాంక్, ఆర్థిక శాస్త్రంలో 117వ ర్యాంక్, రసాయన శాస్త్రంలో 1713వ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకున్నారు. శుభాంగి తండ్రి మనీష్ చంద్ర అగర్వాల్ పట్టణంలో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
Engineering Seat Allotment: కంప్యూటర్ కోర్సుల్లో 98 శాతం భర్తీ.. ఈ నెలాఖరులోగా క్లాసులు ప్రారంభం
సోమవారం కళాశాల యాజమాన్యం విద్యార్థినితో పాటు తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఇందులో ప్రిన్సి పాల్ జగ్‌రాం అంతర్వేది , లెక్చరర్లు సంగీత, అరుణ్ కుమార్, శ్రావణి, సంతోష్ కుమార్, అష్రఫ్ అలీ, రాజ్‌కుమార్, రమేశ్, శ్రీనివాస్, రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Tags
- TS CPGET Results 2024
- TS CPGET Results 2024 News in Telugu
- TS CPGET Results 2024 Link
- PG Admissions
- MSC Admissions
- CPGET2024Results
- CPGETResults
- CPGATE
- CPGATE results
- CPGATE 2024
- CommonEntranceTests
- CommonEntranceTest
- PGCourses
- PostGraduateAdmissions
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024
- sakshieducation latest admissions in 2024
- ShubhangiAdilabad
- AdilabadAchievements
- GovernmentScienceDegreeCollege
- CPGATETopRanker
- BZCStudentSuccess
- CommonPostGraduateEntranceTest
- HardWorkPerseverance
- AcademicExcellence
- CPGATEHighScores