Skip to main content

Paramedical Courses Admissions: పారామెడికల్‌ కోర్సుల్లో దరఖాస్తులకు ఆహ్వానం

Para Medical Course   Dr. T. T. K. Reddy, Principal of Guntur Medical College  Guntur Medical College  Para medical course application announcement  Guntur Medical College campus
Para Medical Course

గుంటూరు మెడికల్‌: గుంటూరు వైద్య కళాశాలలో పారా మెడికల్‌ కోర్సులో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.టి.కె.రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఎనస్థీసియా టెక్నీషియన్‌, మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నీషియన్‌, రెస్పిరేటరీ థెరఫీ టెక్నీషియన్‌, ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్‌ టెక్నీషియన్‌, కార్డియాలజి టెక్నీషియన్‌, ఆఫ్తాల్మిక్‌ టెక్నీషియన్‌, డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌ కోర్సులు వైద్య కళాశాలలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.


Good News అంగన్‌వాడీలకు సొంత భవనాలు Click Here

రెండేళ్ల కాల పరిమితితో అందుబాటులో ఉన్న కోర్సుల్లో చేరేందుకు ఇంటర్‌ బైపీసీ, లేదా దానికి సమాన విద్యార్హత ఉన్న వారు అర్హులని వివరించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆగస్టు 6 సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు వైద్య కళాశాల కార్యాలయంలో అందజేయాలని, కౌన్సెలింగ్‌ ఆగస్టు 19న జరుగుతోందని పేర్కొన్నారు.

దరఖాస్తులు ఇతర వివరాల కోసం ఏపీపీఎంబీ.కో.ఇన్‌, ఏపీఎస్‌ఏపీఎస్‌హెచ్‌పీసీ.కో.ఇన్‌ వెబ్‌సైట్లలో చూడాలని పేర్కొన్నారు.

Published date : 01 Aug 2024 08:45AM

Photo Stories