AP PGCET 2024: పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు
సోమ, మంగళవారాల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుందని పేర్కొన్నారు. పీజీసెట్–2024లో అర్హత పొంది, ఆసక్తి గల విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఎస్వీయూలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో హాజరై అడ్మిషన్లు పొందాలని కోరారు.
మరిన్ని వివరాలకు డీఓఏ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ బాబు 0877–2248589 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
చదవండి: PG Diploma Admissions : మేనేజ్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు
రీసెట్ అడ్మిషన్లు నేటి నుంచి ప్రారంభం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ, కుప్పం ద్రావిడ వర్సిటీ, ఎస్వీయూలో అక్టోబర్ 14 నుంచి ఏపీ రీసెట్ 2023–24 అడ్మిషన్లు ప్రారంభమవుతాయని కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు అక్టోబర్ 13న ఒక ప్రకటనలో తెలిపారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఆయా వర్సిటీలలో సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత వర్సిటీ అడ్మిషన్ల కార్యాలయాల్లో సోమవారం నుంచి అక్టోబర్ 19వ తేదీలోపు రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు.