PGCET: పీజీసెట్‌తో 15 వర్సిటీల్లో ప్రవేశం
దీనివల్ల ఫీజుల భారం తగ్గడంతోపాటు పలు ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవస్థ తప్పింది. గతేడాది ఏపీపీజీసెట్ నిర్వహణ బాధ్యతలను యోగి వేమన వర్సిటీ చేపట్టింది. ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, ఆచార్య నాగార్జున, శ్రీ పద్మావతి మహిళా, యోగి వేమన, రాయలసీమ, విక్రమసింహపురి, ద్రవిడియన్, కృష్ణా, ఆదికవి నన్నయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ, కర్నూలు క్లస్టర్ వర్సిటీలతోపాటు జేఎన్ టీయూ అనంతపూర్– ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాసూ్యటికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (జేఎన్ టీయూఏ–ఓటీపీఆర్‌ఐ)లలోని సీట్లను ఏపీపీజీసెట్ ద్వారా భర్తీ చేశారు. అలాగే పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆయా వర్సిటీలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. ఇందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉండేవి. దీన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఆర్‌సెట్ (రీసెర్చ్‌సెట్)ను కూడా ఇంతకుముందే అమల్లోకి తెచ్చింది. ఈ సెట్‌లో మెరిట్ సాధించినవారికి మాత్రమే ఆయా వర్సిటీల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్టుల వల్ల ఆయా సామాజికవర్గాలకు రిజర్వేషన్లపరంగా అందాలి్సన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో దక్కుతున్నాయి.
చదవండి:
ఎంసెట్ స్టడీమెటీరియర్, సిలబస్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
ఎంసెట్: మోడల్ పేపర్లు | ప్రివియస్ పేపర్స్ | ప్రాక్టీస్ ప్రశ్నలు
ఏపీపీజీసెట్–2021లో సామాజికవర్గాలవారీగా విద్యార్థుల వివరాలు ఇలా..
కేటగిరీ |
నమోదు |
హాజరు |
అర్హులు |
బీసీ ఏ |
5,276 |
4,743 |
3,212 |
బీసీ బీ |
5,664 |
5,072 |
3,531 |
బీసీ సీ |
374 |
339 |
262 |
బీసీ డీ |
9,065 |
8,208 |
5,728 |
బీసీ ఈ |
1,464 |
1,312 |
935 |
ఓసీ |
7,273 |
6,563 |
4,802 |
ఎస్సీ |
8,908 |
7,789 |
7,789 |
ఎస్టీ |
1,994 |
1,709 |
1,709 |
మొత్తం |
40,018 |
35,735 |
27,968 |