Skip to main content

IIST Admissions: ఉజ్వల భవిష్యత్తుకు... చక్కటి మార్గం

అంతరిక్ష రంగంలో ఉజ్వల భవిష్యత్తును కోరుకునే వారికి చక్కటి మార్గం.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ). అంతరిక్షం, రిమోట్‌ సెన్సింగ్, ఏవియానిక్స్‌ వంటి కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఐఐఎస్‌టీ మంచి వేదికగా నిలుస్తోంది. ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో స్కోర్‌ సాధించిన వారికి ఈ ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్‌లో ప్రవేశం లభిస్తుంది. విజయంతంగా కోర్సు పూర్తి చేసుకుంటే.. ఇస్రో/డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ) సంస్థల్లో ఉద్యోగావకాశాలను సైతం పొందవచ్చు. ఇటీవల ఐఐఎస్‌టీలో బీటెక్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎస్‌టీ అందించే అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) కోర్సులు, అర్హతలు, ప్రవేశ విధానంపై ప్రత్యేక కథనం..
IIST B.Tech Admission 2021 notification released
IIST B.Tech Admission 2021 notification released

ఐఐఎస్‌టీ
దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు సంబం«ధించిన కోర్సులను అందించే ప్రతిష్టాత్మక సంస్థగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ)కి మంచి గుర్తింపు ఉంది. ఈ విద్యా సంస్థను 2007లో కేరళలోని తిరువనంతపురంలో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసారు. ఇది డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ హోదా సైతం పొందింది. ఇంటర్మీడియట్‌/10+2 అర్హతతో అంతరిక్ష రంగానికి సంబంధించిన యూజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ముఖ్యంగా ఐఐఎస్‌టీ..ఏరోస్పేస్, ఏవియానిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్‌ సిస్టం సైన్సెస్, మ్యాథ్స్, ఫిజిక్స్, రిమోట్‌ సెన్సింగ్‌ విభాగాల్లో స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్‌గా కోర్సులను అందిస్తోంది.

యూజీ కోర్సులు

 • బీటెక్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌: ఈ కోర్సులో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు.
 • బీటెక్‌ ఈసీఈ(ఏవియానిక్స్‌): ఈ కోర్సులో కూడా మొత్తం 70 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. 
 • డ్యూయల్‌ డిగ్రీ(బీటెక్‌తోపాటు ఎంటెక్‌/ఎంఎస్‌): ఈ కోర్సు కాల వ్యవధి ఐదేళ్లు. ఇందులో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డ్యూయల్‌ డిగ్రీ పూర్తి చేసిన వారికి బీటెక్‌ ఇంజనీరింగ్‌ ఫిజిక్స్‌తోపాటు ఎంఎస్‌ ఇన్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ /ఎంఎస్‌ ఇన్‌ సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌/ఎంఎస్‌ ఇన్‌ ఎర్త్‌ సిస్టం సైన్స్‌/ఎంటెక్‌ ఇన్‌ ఆప్టికల్‌ ఇంజనీరింగ్‌ల్లో ఏదో ఒకటి ప్రధానం చేస్తారు. 

అర్హతలు

 • 10+2/ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐఐఎస్‌టీ నిర్దేశించిన మార్కులను సాధించిన వారు ఐఐఎస్‌టీ 2021కు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 • వయసు: అక్టోబర్‌ 01,1996 తర్వాత జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ /పీడబ్ల్యూడీ వర్గాల విద్యార్థులు అక్టోబర్‌ 01,1991 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం

 • ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2021లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా కేటగిరీల వారీగా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
 • ఎస్సీ–15 శాతం,ఎస్టీ–7.5 శాతం, ఓబీసీ, ఎన్‌సీఎల్‌–27 శాతం,పీడబ్ల్యూడీ–5 శాతం, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 10శాతం సీట్లు రిజర్వ్‌ చేశారు.

ప్రయోజనాలు

 • ఐఐఎస్‌టీ అందించే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు.. మొదటి సెమిస్టర్‌లో 10 సీజీపీఏకు 7.5 సీజీపీఏ సాధిస్తే.. వారు రెండో సెమిస్టర్‌ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి సెమిస్టర్‌లో నిర్దేశిత సీజీపీఏను సాధిస్తే.. సెమిస్టర్‌ ఫీజు ఇతర ఖర్చులను విద్యాసంస్థ భరిస్తుంది. 
 • ఇంటర్న్‌షిప్‌: యూజీ కోర్సుల విద్యార్థులు ఇస్రో సెంటర్లు, జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థల్లో క్రెడిటెడ్‌ ఇంటర్న్‌షిప్‌లు చేయవచ్చు.

ఉద్యోగావకాశాలు

 • చేరిన కోర్సును కనీసం 7.5 సీజీపీఏతో పూర్తి చేసుకుంటే.. ఖాళీలకు అనుగుణంగా ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ప్రకారం ఇస్రో లేదా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ కేంద్రాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అలా కొలువులు పొందిన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.56,100 అందుతుంది. దీనికి అదనంగా హెచ్‌ఆర్‌ఏ, టీఏ తదితర ఇతర ప్రయోజనాలు ఉంటాయి. 

ముఖ్యమైన సమాచారం

 • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 • దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 20, 2021
 • ఐఐఎస్‌టీ అడ్మిషన్‌ ర్యాంక్‌ లిస్ట్‌: అక్టోబర్‌ 21, 2021
 • బ్రాంచ్‌ ప్రిఫరెన్స్‌: అక్టోబర్‌ 22, 2021
 • సీట్‌ అలాట్‌మెంట్‌: అక్టోబర్‌ 23, 2021
 • ఐఐఎస్‌టీలో ప్రవేశం: నవంబర్‌ 30, 2021
 • క్లాసులు ప్రారంభం: డిసెంబర్‌ 07, 2021

వెబ్‌సైట్‌: http://admission.iist.ac.in

చ‌ద‌వండి: AP DEECET-2021: ఇంటర్‌తోనే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశానికి మార్గం.. ప్రిపరేషన్‌ ఇలా..

Published date : 12 Oct 2021 05:19PM

Photo Stories