Skip to main content

Show Cause Notice: ఇంజ‌నీర్ల‌కు షోకాజ్ నోటీసులు జారీ

ప‌లు రంగాల్లోని ఇంజ‌నీర్ల‌కు త‌మ ల‌క్ష్యాలు వెనుక ప‌డ‌డంతో, అందుకు త‌గిన కారణాల‌ను ఇచ్చిన గ‌డువులోగా సంజాయిషీ తెల‌పాల‌ని హెచ్చ‌రిస్తూ నోటీసులు జారీ చేసారు.
show cause notice issued for engineers by government, Explanation Deadline,Target Missed Warning
show cause notice issued for engineers by government

సాక్షి ఎడ్యుకేష‌న్: పంచాయతీరాజ్‌ శాఖలో ఐదుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు(డీఈఈ), 223 మంది ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ప్రాధాన్యాలైన సచివాలయాలు, డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల పురోగతిలో వెనుకబడిన కారణంగా డీఈఈలు అరుణ్‌కుమార్‌ (ఉరవకొండ), మురళీధర్‌ (గుత్తి), రాజన్న (కళ్యాణదుర్గం), రామ్మోహన్‌రెడ్డి (రాయదుర్గం), రజనీకాంత్‌రెడ్డి (తాడిపత్రి)లకు పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ యమ్మాని భాగ్యరాజ్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Results: డిగ్రీ ఫలితాలు విడుదల

అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం, లక్ష్యాల పురోగతిలో అలసత్వం వహించిన జిల్లాలోని 223 మంది ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు కూడా షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఎస్‌ఈ తెలిపారు. లక్ష్యాలను సాధించడంలో ఎందుకు వెనుకబడ్డారో సహేతుక కారణాలతో వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ గౌతమికి నివేదిక పంపారు.

Published date : 09 Sep 2023 11:20AM

Photo Stories