Results: డిగ్రీ ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని 2015–19 మధ్య డిగ్రీ చదివిన విద్యార్థులకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ గురువారం విడుదల చేశారు. డిగ్రీ సప్లిమెంటరీ, 4, 6 సెమిస్టర్లు, బీపీఈడీ, డీపీఈడీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్, జ్ఞాన భూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. డిగ్రీ ఆరో సెమిస్టర్ 3203 మంది రాయగా, 2152 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆరో సెమిస్టర్ 3607 మంది రాయ గా, 1664 మంది ఉత్తీర్ణత సాధించారు. నాలుగో సెమిస్టర్‌లో బీఏలో 203 మందికి 195 మంది, బీఎస్సీలో 2654 మందికి 1753, బీబీఏలో 5కి 5, బీసీఏలో 6కి 5, బీకాం కంప్యూటర్స్‌లో 236కి 102, బీకాం జనరల్‌లో 99కి 92 మంది ఉత్తీర్ణత సాధించారు.
నాలుగో సెమిస్టర్‌లో బీఏలో 488కి 163, బీఎస్సీ లో 2544 మందికి 1293, బీబీఏలో 11కి 3, బీసీఏ లో 1కి 1, బీకాం కంప్యూటర్స్‌లో 236కి 90, బీకాం జనరల్‌లో 327కి 114 మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సెమిస్టర్ బీపీఈడీలో 191కి 162, డీపీఈడీలో 7కి ఆరుగురు ఉత్తీర్ణత సాధించారు. వర్సిటీలో గతంలో ప్రవేశాలు నిర్వహించిన బీవీఓసీ యానిమల్ హజ్బెండరీ నాలుగో సెమిస్టర్‌లో 23కి 23, బీఓఓసీ ఫిషరీష్ సైన్స్ నాలుగో సెమిస్టర్‌లో 27కి 27మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులకు అంద జేసేందుకు మార్కుల జాబితాలు సిద్ధంగా ఉంచా రు. 15 రోజుల్లోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు.