Skip to main content

TG DSC 2024 Jobs Selection Ratio : డీఎస్సీ 2024 పోస్టులకు 1:1 నిష్పత్తిలో జాబితా.. ఈ సారి అధిక శాతం వీరికే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ డీఎస్సీ-2024 ఇటీవ‌లే ప్ర‌క‌టించి... స‌ర్టిఫికెట్ల‌ వెరిఫికేష‌న్ కూడా పూర్తి చేశారు. తెలంగాణ‌లోని అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
TG DSC 2024 Jobs Final Selection Ratio  Telangana DSC-2024 recruitment process announcement Telangana DSC-2024 teacher recruitment for 11,062 posts Telangana DSC-2024 recruitment in all districts  Teacher recruitment under Telangana DSC-2024

మరోవైపు అభ్యర్ధులు స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) పోస్టుల్లో ఏదో ఒక దానికే ఎంపికయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గానూ ఈ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

1:1 నిష్పత్తిలో తుది జాబితా విడుదల..
ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో వందల మంది అభ్యరులు రెండు, మూడు పోస్టులకు ఎంపికవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారు చివరిగా ఏదో ఒక పోస్టును ఎంపిక చేసుకుంటే తదుపరి వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా మిగిలి పోతున్నాయి. ఈ పరిసితిని నివారించేందుకు తొలుత స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో 1:1 నిష్పత్తిలో తుది జాబితా విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

➤☛ TS Revenue Department Jobs 2024 : రెవెన్యూ శాఖలో కొత్తగా 5000 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. పోస్టుల వివ‌రాలు ఇవే...

ఎస్‌జీటీకి ఎంపికైన వారి జాబితాను మాత్రం..
ఆ తర్వాత ఎస్‌జీటీకి ఎంపికైన వారి జాబితా వెలువడనుంది. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో దానిలోనూ ఉంటే ఆ పేరును తొలగించి, ఆ తర్వాత మెరిట్‌లో ఉన్న వారిని వారి స్థానంలో చేరుస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేసినట్లు పేర్కొంది.

వీటికి టెట్‌ మార్కులు అవసరం లేద‌ని..

ts dsc 2024 jobs news telugu

ఇక స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టుల్లో ఈసారి 220 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 796 ఎస్‌జీటీ స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటికి టెట్‌ మార్కులు అవసరం లేదని గత ఏప్రిల్‌లో 62 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 17 జిల్లాల్లోనే ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయగా.. 16 జిల్లాల్లో జరగలేదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. 

➤☛ TG DSC 2024 Ranker Success Story : ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చ‌దివి.. టీచ‌ర్ ఉద్యోగం కొట్టానిలా... నా భార్య కూలీ చేసి.. !

ఈ సారి అధిక శాతం మంది మహిళలే...
ఈసారి టీచర్‌ పోస్టులకు పోటీపడిన వారిలో అధిక శాతం మంది మహిళలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. వివాహం ముందు, తరువాత వారి ఆధార్‌కార్డుల్లో ఇంటి పేర్లు, ఇతర వివరాలు వేరుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

దీంతో ధ్రువపత్రాల పరిశీలన సందర్భంగా డీఈవోలు సదరు మహిళా అభ్యరుల భర్తలను పిలిచించి వారితో ఈమె తన భార్య అని లెటర్‌ రాయించుకుని, దానిని ధ్రువపత్రాల్లో చేర్చి తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద ఈ సారి డీఎస్సీ 2024 ఉద్యోగాల ఎంపిక ప్ర‌క్రియ కొద్దిగా ఆందోళ‌గానే ఉంది. అలాగే కొంద‌రు ఫేక్ స‌ర్టిఫికెట్లు కూడా స‌ర్టిఫికెట్ల‌ వెరిఫికేష‌న్‌లో స‌మ‌ర్పించార‌ని...ఆరోపిస్తున్నారు.

➤☛ Brother and Sister Success Story : ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న‌ చనిపోయినా.. మా అమ్మ...

Published date : 07 Oct 2024 05:57PM

Photo Stories