DSC 2024 Appointment Letters: 9న సీఎం చేతుల మీదుగా ఉపాధ్యాయ నియామక పత్రాలు
Sakshi Education
హైదరాబాద్: అక్టోబర్ 9 తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామ క పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో అక్టోబర్ 6న సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీచేస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారని, సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారని తెలిపారు.
చదవండి: Nukamalla Indira: ఎంపీటీసీ నుంచి స్కూల్ టీచర్‌గా
ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరూ తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలలోపే ఎల్.బి.స్టేడియానికి చేరేలా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వారిని హైదరాబాద్‌కు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 07 Oct 2024 01:12PM
Tags
- Teacher Appointment Letters
- DSC 2024 Appointment Letters
- LB Stadium
- Hyderabad
- telangana cm revanth reddy
- shanti kumari
- Commissioner of School Education
- Teacher Recruitment
- Teachers
- Appointment Letter for Teacher
- Appointment Letter To A School Teacher
- Telangana News
- Hyderabad
- ChiefSecretaryShantikumari
- CMRevanthReddy
- TeacherAppointments
- GovernmentArrangements
- TelanganaEvents
- NewTeacherRecruitment
- Teleconference
- SakshiEducationUpdates