TS DSC 2024 Final Key Mistakes : డీఎస్సీ ఫైనల్ కీలో కూడా తప్పులున్నాయి... ఆ మార్కులను కలిపిన తర్వాతనే ..?
డీఎస్సీ-2024 ప్రాథమిక కీ లో కొన్ని ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని.. దాదాపు 28 వేలకు పైగా అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపారు. అలాగే ఫైనల్ కీ లో కూడా చాలా తప్పులు ఉన్నాయని అభ్యర్థులు అంటున్నారు. వాటిని సరిచేసి మరోసారి ఫైనల్ కీ విడుదల చేయాలని డిఎస్సి అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖలను కోరారు. అలాగే హైదరాబాద్ లక్డికపుల్ లోని పాఠశాల విద్య శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాన్ని అభ్యర్థులు అందజేశారు.
☛➤ TS DSC 2024 Exam Answer Key Mistakes : తెలంగాణ డీఎస్సీ-2024 'కీ' లో ఇన్ని తప్పులా..? ఈ 18 ప్రశ్నలకు మార్కులను..
మార్కులను కలిపిన తర్వాత రిజల్ట్స్ విడుదల చేయాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన మొదటి డీఎస్సీలో అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము మార్కులు కోల్పోతున్నామన్నారు. ప్రైమరీ కీ ను ఆగస్టు 13 న రిలీజ్ చేశారని... అందులో తప్పులు ఉన్నాయని మొరపెట్టుకున్నామని , తిరిగి ఫైనల్ కీ లో కూడా అదే తరహా తప్పులు దొర్లాయన్నారు. అధికారులకు ఆ తప్పులకు సంబందించిన అన్ని వివరాలను అందజేశామని తెలిపారు. ఫైనల్ కీ లో తప్పులను సరిదిద్ది.., తాము కోల్పోయిన మార్కులను కలిపి , రిజల్ట్స్ విడుదల చేయాలని కోరారు.
ఫైనల్ 'కీ'పై అభ్యర్థుల అభ్యంతరాలు ఇవే..
ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు?
1)ఏకాదేశం
2)ఆదేశం
3)బహుళము
4)నిత్యము
అయితే అధికారులు విడుదల చేసిన తుది కీ ప్రకారం సరైన సమాధానం ఆప్షన్ 2) ఆదేశం అని ఇచ్చారు. కానీ అభ్యర్థులు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1) ఏకాదేశం అంటున్నారు. ఇదే ప్రశ్న ఈ ఏడాది మే లో జరిగిన టెట్ పరీక్షలోనూ ఇచ్చారు. ఫైనల్ కీలో సమాధానం ఏకాదేశం ఇచ్చారని, కానిప్పుడు డీఎస్సీలో 'ఆదేశం' ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సరైన సమాధానం.. ఇప్పుడు డీఎస్సీలో ఎందుకు తప్పవుతుందని ప్రశ్నిస్తున్నారు. పుస్తకాల్లోనూ కరెక్ట్ ఆన్సర్ 'ఏకాదేశం' ఉందని అంటున్నారు.
భారత ఉపరాష్ట్రపతి వీరిచే ఎన్నుకోబడతారు?
1) పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన మరియు నామినేట్ చేయబడిన సభ్యులు
2)అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎన్నికైన ఎమ్మెల్యేలు
3)లోక్‌సభ మరియు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మాత్రమే
4)అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు,పార్లమెంట్ సభ్యులు
కానీ అభ్యర్థులు చెబుతున్న దాని ప్రకారం సరైన జవాబు ఆప్షన్ 3 అంటున్నారు. పుస్తకాల్లోనూ ఇదే జవాబు ఉందని ఆధారాలు చూపిస్తున్నారు.
'డ్నీపర్, వోల్గా వంటి నదులు ఈ ప్రాంతంలో ఉద్భవించాయి' అనే ప్రశ్నలో 'నైపర్’ అనే పదం అనువాదం తప్పుగా పడింది. దీనికి మార్కును కలపాలి.
మనం మానసికంగా ఆరోగ్యవంతుడు అని చెప్పినప్పుడు.. అది ఈ క్రింది అంశాల పరంగా ఆరోగ్యకరమని అర్థం' ఈ ప్రశ్నకు ఏ, బీ, సీ, డీ నాలుగు ఆప్షన్లు సరైనవి.
పట్టణాలు, గ్రామాల్లో మీరు అత్యంత ఇష్టపడేవి ఏవీ అను ప్రశ్న ఈ విద్యాప్రమాణాన్ని సాధించేందుకు ఉద్ధేశించినది' దీనికి సమకాలీన సమస్యలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట సరైన సమాధానం.
ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌లో 'ఇన్‌విట్రో' అంటే అక్షరాలా అర్థం అన్న ప్రశ్నకు ప్రయోగశాలలో అన్నది కూడా సరైన సమాధానం.
ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పవర్ పార్క్‌ను ఈ రాష్ట్రంలో ప్రారంభించారు' అన్న ప్రశ్న ఇచ్చారు. కానీ ఇంగ్లిష్‌లో శక్తిస్థల అన్న పేరు ఇచ్చి తెలుగులో ఈ పేరును ఇవ్వలేదు. కనుక దీనికి మార్కు కలపాలి.
అభ్యర్థుల అభ్యంతరాల నేపథ్యంలో డీఎస్సీ ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశముంది. వంద మందికి పైగా అభ్యర్థులు ఫైనల్ కీపై అభ్యంతరాలు వ్యక్తంచేయగా, వాటిని పరిశీలించి మరోసారి సబ్జెక్టు నిపుణుల కమిటీకి ఆధారాలు పంపిస్తామని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. తప్పులు నిజంగానే దొర్లాయని నిపుణుల కమిటీ గుర్తిస్తే మళ్లీ రివైజ్డ్ 'కీ'ని విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీఎస్సీలో వచ్చిన మారులు, టెట్ మారులను కలిపి జీఆర్‌ఎల్(జనరల్ ర్యాంకింగ్ లిస్ట్)ను విడుదల చేస్తారు. అనంతరం 1:3 జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టి మెరిట్ ప్రకారం నియామక పత్రాలను అందజేస్తారు. అయితే తుది 'కీ' లోనూ తప్పులు దొర్లితే ఈ ప్రక్రియంతా జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది.
Tags
- ts dsc final key
- ts dsc final key updates
- TS DSC Final Key Mistakes
- ts dsc final key objections
- ts dsc final key objections 2024 news telugu
- ts dsc final answer key 2024 news telugu
- TS DSC 2024 Key Problems
- ts dsc 2024 key objections
- ts dsc 2024 key mistakes
- ts dsc 2024 key
- ts dsc 2024 key news
- TS DSC
- Telangana DSC 2024
- DSC 2024 recruitment process
- DSCExams
- DSC final key errors
- Telangana DSC final key correction
- DSC candidates request
- Telangana DSC exam controversies
- School education department DSC 2024
- sakshieducationlatest news