Skip to main content

DSC 2024: కొత్త టీచర్లు వస్తున్నారు.. కొత్తగా ఇంత‌ మందికి పోస్టింగ్‌

భూపాలపల్లి అర్బన్‌: విద్యాశాఖలో టీచర్‌ కొలువుల కోలాహలం నెలకొంది. ప్రభుత్వం జూలై, ఆగస్టు మాసాల్లో నిర్వహించిన డీఎస్సీ–2024 పరీక్ష ఫలితాలను గత సోమవారం విడుదల చేసి 1:3 పద్ధతిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు.
New teachers are coming

అలాగే 2008లో జరిగిన డీఎస్సీలో 30 శాతం కోటా అర్హత కలిగిన బీఈడీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిన విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ రెండు డీఎస్సీలకు సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి కొత్త టీచర్లు రానున్నారు.

కొత్తగా 237 మందికి పోస్టింగ్‌

2024 డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకారం జిల్లాలో మొత్తం 237 టీచర్‌ పోస్టులు ఉన్నాయి. ఇందులో 151 ఎస్టీలు, 186 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు 1:3 నిష్పత్తి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్లు పరిశీలించారు. ఎంపిక ప్రక్రియ పూర్తి అయిన వెంటనే జిల్లాలో డీఎస్సీ ద్వారా 237 మంది కొత్తగా ఉపాధ్యాయ విధుల్లో చేరనున్నారు. అలాగే 2008లో జరిగిన డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిన విధుల్లోకి తీసుకోనున్నారు. అందులో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 400పైగా అభ్యర్థులు ఉండగా భూపాలపల్లి జిల్లాకు 80 మంది పైచిలుకు ఉన్నారు. ఇప్పటికే వీరిని దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈ ప్రక్రియ పూర్తయితే కాంట్రాక్టు పద్ధతిన మరికొందరు ఉపాధ్యాయులు రానున్నారు.

చదవండి: Nukamalla Indira: ఎంపీటీసీ నుంచి స్కూల్‌ టీచర్‌గా

తీరనున్న ఉపాధ్యాయుల కొరత

పదవీ విరమణలే తప్ప పెద్దగా ఉపాధ్యాయ నియామకాలు లేనందున ఖాళీల సంఖ్య భారీగానే ఉంది. దీంతో సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో 2008 డీఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిన నియమించుకోవడం.. తాజాగా 2024 డీఎస్సీ ఫలితాలు విడుదల చేసి మరికొందరికి పోస్టింగ్‌లు ఇవ్వనుండడంతో జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీరనుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

9న నియామక పత్రాలు

పాఠశాలలకు ఈ నెల 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఉన్నాయి. 15న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అయితే డీఎస్సీ 2024 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఇప్పటికే పూర్తయింది. తర్వాత అభ్యర్థులను ఎంపిక చేసి దసరా కానుకగా ఈ నెల 9న నియామక పత్రాలు ఇస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. నియామక పత్రాలు తీసుకున్న వారంతా దసరా సెలవుల తర్వాత విధుల్లో చేరనున్నారు.

  • అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న అధికారులు
  • దసరా తర్వాత విధుల్లోకి..
  • ప్రభుత్వ పాఠశాలల్లో తీరనున్న ఉపాధ్యాయుల కొరత
  • జిల్లాలో 237 మందికి ఉద్యోగాలు
  • కాంట్రాక్టు పద్ధతిన మరికొందరు..
  • ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన
  • 9న నియామక పత్రాలు అందించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

జిల్లా వ్యాప్తంగా భర్తీ అయ్యే పోస్టులు ఇవీ..

ఎల్పీ (హిందీ) 7, ఎల్పీ (తెలుగు) 13, పీఈటీ (తెలుగు) 7, ఎస్‌ఏ–(బీఎస్‌) తెలుగు 9, ఎస్‌ఏ (ఇంగ్లిష్‌) 6, ఎస్‌ఏ (హిందీ) 2, ఎస్‌ఏ(ఎం) తెలుగు 4, ఎస్‌ఏ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) తెలుగు2, ఎస్‌ఏ (ఫిజికల్‌ సైన్స్‌) తెలుగు 3, ఎస్‌ఏ (ఎస్‌ఎస్‌) తెలుగు 11, ఎస్‌ఏ (తెలుగు) 4, ఎస్‌ఏ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) తెలుగు 4, ఎస్జీటీ (తెలుగు) 151, ఎస్జీటీ (ఉర్దూ)1, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) తెలుగు 13 పోస్టులు భర్తీ కానున్నాయి.
 

Published date : 07 Oct 2024 03:21PM

Photo Stories