T20 World Cup Semi Final 2022 : టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా..! ఎలా అంటే..?
భారత్ గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉండడంతో..
బంగ్లాదేశ్‌పై గెలుపుతో భారత్ గ్రూప్-2లో అగ్రస్థానానికి దూసుకుపోవడంతో పాటు సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.
నవంబర్ 6వ తేదీన జింబాబ్వేతో టీమ్ ఇండియా మ్యాచ్ ఉన్నాయి. ఇక గ్రూప్-2లో భారత్ టాప్‌లో నిలవాలంటే దక్షిణాఫ్రికా తన తదుపరి మ్యాచ్‌లలో ఒక దాంట్లో ఓడిపోవాలి. సఫారీలకు తదుపరి మ్యాచ్‌లు పాకిస్థాన్‌తో, నెదర్లాండ్స్‌తో ఉన్నాయి.
ICC 2022 World Cup : మరో సంచలనం.. పాక్‌కు జింబాబ్వే భారీ షాక్
భారత్ బ్యాంటింగ్ ఇలా..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 64 పరుగులు) అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్ సైతం అత్భుతమైన పోరాటపటిమ కనబర్చి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
బంగ్లా బ్యాటింగ్ ఇలా..
బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ (27 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఛేదనలో మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి టీమిండియాను వణికించాడు. అయితే అనవసరమైన రెండో పరుగు కోసం ప్రయత్నించి అతను రనౌట్ కావడంతో బంగ్లా పతనం మొదలైంది. ఆతర్వాత భారత పేసర్లు పుంజుకుని బంగ్లా ఆటగాళ్లను వరుసగా పెవిలియన్‌కు పంపారు. అర్షదీప్, హార్ధిక్ పాండ్యా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. షమీకి ఓ వికెట్ దక్కింది.
T20 World Cup 2022 : పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ ఇదే..
డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం..
బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో 7వ ఓవర్ తర్వాత వర్షం ఆరంభం కావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లా టార్గెట్‌ను 16 ఓవర్లలో 151 పరుగులుగా నిర్ధేశించారు.
భారత్ & బంగ్లాదేశ్ స్కోర్ వివరాలు ఇలా..
టీమిండియా: 184/6 (20 ఓవర్లు)
బంగ్లాదేశ్: 145/6 (16 ఓవర్లు)
T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్-2022 విజేత, రన్నరప్ టీమ్‌లకు ప్రైజ్‌మనీ ఎంతంటే..?
సెమీస్ అవకాశాలు వీరికే..
☛ సూపర్‌లీగ్ -12లో 45 మ్యాచ్‌లకు గాను ఇప్పటివరకూ 33 మ్యాచ్‌లు జరిగాయి.
☛ టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా నవంబర్ 2వ తేదీన జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ గెలుపుతో భారత్ దాదాపు సెమీస్‌లో ఉన్నట్టే.
☛ అఫ్గానిస్థాన్ జట్టుకు సెమీస్ అవకాశాలు లేవు. ఐర్లాండ్‌కూ దాదాపు అవకాశం లేనట్లే. అయితే, ఈ రెండు జట్లూ ఇతర టీమ్‌ల అవకాశాలను ప్రభావితం చేస్తాయి.
☛ ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ గెలిస్తే సెమీస్ బెర్తు ఖాయం. ఓడితే కివీస్‌కు ఇబ్బందే. ఐర్లాండ్‌కు గెలిచినా, ఓడినా ఎలాంటి ప్రయోజనం లేదు.
☛ అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఓడితే కష్టాలు తప్పవు. అఫ్గాన్‌కు గెలిచినా, ఓడినా ఉపయోగం లేదు.
☛ శ్రీలంకపై ఇంగ్లాండ్ గెలిస్తే సెమీస్‌కు చేరుకున్నట్లే. శ్రీలంక గెలిస్తే మాత్రం ఇంగ్లాండ్ ఇంటికే. లంకకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
☛ న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచుల్లో విజయం సాధిస్తే.. నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. ఏడేసి పాయింట్లతో సమానంగా నిలిచే ఈ జట్లు ఎవరికి రన్‌రేట్ అధికంగా ఉంటే ఆ రెండే సెమీస్‌కు చేరతాయి.
☛ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే.. నెట్ రన్‌రేట్ ఆధారంగా కివీస్ మాత్రమే సెమీస్‌కు చేరుకుంటుంది.
T20 World Cup New Rules : టి-20 వరల్ట్ కప్‌లో అమలు కానున్న కొత్త రూల్స్ ఇవే.. ఫస్ట్ టైమ్..
టీ20 వరల్డ్ కప్ 2022 గ్రూప్-1, గ్రూప్-2 పాయింట్ల పట్టికలు ఇవే..
గ్రూప్ - 1:
జట్టు | ఆడిన మ్యాచ్‌లు | విజయాలు | ఓటమి | ఫలితం తేలనివి | పాయింట్లు | నెట్ రన్ రేట్ |
న్యూజిలాండ్ | 4 | 2 | 1 | 1 | 5 | +2.233 |
ఇంగ్లాండ్ | 4 | 2 | 1 | 1 | 5 | +0.547 |
ఆస్ట్రేలియా | 4 | 2 | 1 | 0 | 5 | -0.304 |
శ్రీలంక | 4 | 2 | 2 | 0 | 4 | -0.457 |
ఐర్లాండ్ | 4 | 1 | 2 | 1 | 3 | -1.544 |
అఫ్గానిస్థాన్ | 4 | 0 | 2 | 2 | 2 | -0.718 |
Cricket New Rules : కొత్త నిబంధన ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా..
గ్రూప్ - 2:
జట్టు | ఆడిన మ్యాచ్‌లు | విజయాలు | ఓటమి | ఫలితం తేలనివి | పాయింట్లు | నెట్ రన్ రేట్ |
భారత్ | 4 | 3 | 1 | 0 | 6 | +0.730 |
దక్షిణాఫ్రికా | 3 | 2 | 0 | 1 | 5 | +2.772 |
బంగ్లాదేశ్ | 3 | 2 | 1 | 0 | 4 | -1.533 |
జింబాబ్వే | 3 | 1 | 1 | 1 | 3 | -0.050 |
పాకిస్థాన్ | 3 | 1 | 2 | 0 | 2 | +0.765 |
నెదర్లాండ్స్ | 3 | 0 | 3 | 0 | 0 | -1.948 |
T20 Highest Wicket Taker : 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా..