T20 World Cup 2022 : టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే.. ఇప్పటి వరకు ఈ రికార్డులను ఎవరూ..
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16వ తేదీ(ఆదివారం) నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే టీమిండియా సభ్యుడిగా పలుసార్లు ఈ మెగా టోర్నీ ఆడిన రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్‌గా కొత్త హోదాలో బరిలోకి దిగనున్నాడు.
T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్-2022 విజేత, రన్నరప్ టీమ్‌లకు ప్రైజ్‌మనీ ఎంతంటే..?
ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో అద్భుత రికార్డు ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను ఊరిస్తున్న ఐదు రికార్డులను ఓసారి పరిశీలిద్దాం..
1.కెప్టెన్‌గా అరుదైన రికార్డు సాధించే అవకాశం..
యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ హిట్టర్ క్రిస్‌గేల్ 2010 ప్రపంచకప్‌లో తమ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ సందర్భంగా టీమిండియాతో మ్యాచ్‌లో 66 బంతులు ఎదుర్కొన్న అతడు 98 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఒక కెప్టెన్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఇప్పుడు రోహిత్ శర్మకు ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశం ముందుంది. టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగనున్న హిట్‌మ్యాన్ 99 లేదంటే ఏకంగా సెంచరీ సాధించాడంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా నిలుస్తాడు.
T20 World Cup India Team : టీ-20 వరల్డ్ కప్ 2022 టీమిండియా ఇదే.. వీరికి మరోసారి మొండిచెయ్యి..
2. అత్యధిక పరుగుల వీరుడిగా..
టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్దనేకు అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డు ఉంది. మొత్తంగా ఐదుసార్లు ఈ ఐసీసీ ఈవెంట్ ఆడిన జయవర్ధనే 1016 పరుగులు సాధించాడు.విండీస్ హిట్టర్ క్రిస్‌గేల్ 965, తిలకరత్నె దిల్షాన్ 897 పరుగులతో అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాన్ని రోహిత్ శర్మ ఆక్రమించాడు. ఇప్పటి వరకు 847 పరుగులు సాధించాడు. ఈసారి ప్రపంచకప్‌లో అతడు మొత్తంగా 169 పరుగులు సాధిస్తే అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
T20 World Cup New Rules : టి-20 వరల్ట్ కప్‌లో అమలు కానున్న కొత్త రూల్స్ ఇవే.. ఫస్ట్ టైమ్..
3. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా..
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 2007లో టీమిండియా తరఫున తొలిసారి టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడిన అతడు.. మరో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలుస్తాడు.ధోని, గేల్, ముష్షికర్ రహీంలను దాటుకుని.. శ్రీలంక ఆటగాడు తిలకరత్నె దిల్షాన్(35 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతాడు. ఎలాంటి ఆటంకాలు, గాయాల బెడద వంటివి లేకుండా రోహిత్ బరిలోకి దిగితే ఈ రికార్డు సాధించడం లాంఛనమే!
ఇప్పటి వరకు టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే..
☛ తిలకరత్నె దిల్షాన్-35
☛ డ్వేన్ బ్రావో- 34
☛ షోయబ్ మాలిక్- 34
☛ ఎంఎస్ ధోని- 33
☛ క్రిస్ గేల్-33
☛ ముష్ఫికర్ రహీం- 33
☛ రోహిత్ శర్మ- 33
Cricket New Rules : కొత్త నిబంధన ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా..
4. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ..
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఇంగ్లండ్ ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. 2012లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 58 బంతుల్లో 123 పరుగులు సాధించి.. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు.ఇక మెగా ఈవెంట్‌లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 65 బంతుల్లో 79 పరుగులు. 2010లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఈ స్కోరు సాధించాడు. ఇక పొట్టి క్రికెట్‌లో ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్‌లో 4 సెంచరీలు నమోదు చేసిన హిట్‌మ్యాన్ .. మరో శతకం బాదడం సహా అదనంగా మరో 24 పరుగులు సాధిస్తే మెకల్లమ్‌ను అధిగమించే అవకాశం ఉంది.
BCCI New President : బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఈయనే.. ?
5. అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా..
టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ శర్మ కచ్చితంగా బద్దలు కొట్టగల మరో రికార్డు ఇది. ఇప్పటి వరకు ఈ ఐసీసీ టోర్నీలో 31 సిక్సర్లు కొట్టిన హిట్‌మ్యాన్.. మరో మూడు సిక్స్‌లు బాదితే చాలు. ఈ మేజర్ ఈవెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. తద్వారా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు(33 సిక్స్‌లు) బద్దలు కొడతాడు.
T20 Highest Wicket Taker : 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా..