Skip to main content

T20 World Cup New Rules : టి-20 వ‌ర‌ల్ట్ క‌ప్‌లో అమ‌లు కానున్న కొత్త రూల్స్ ఇవే.. ఫ‌స్ట్ టైమ్‌..

క్రికెట్‌లో అక్టోబర్‌ ఒకటి నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌ లాంటి మేజర్‌ టోర్నీలో ఈ రూల్స్‌ తొలిసారి అమలు కానున్నాయి.

క్రికెట్‌లో చట్టాలు చేసే మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) గత మార్చిలోనే మన్కడింగ్‌ సహా పలు అంశాలపై నూతన చట్ట సవరణలు తీసుకొచ్చింది. వీటికి ఐసీసీ కూడా గతంలోనే ఆమోద ముద్ర వేసింది. అయితే అక్టోబర్‌ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తామని ఐసీసీ పేర్కొంది.

ICC Rankings: కోహ్లి 14 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు

ఈ రూల్‌లో ముఖ్యంగా..

ICC

కాగా మన్కడింగ్‌ అనే పదం ఇక క్రికెట్‌లో చట్టబద్ధం అని ఎంసీసీ పేర్కొన్న సంగతి తెలిసిందే.  బౌలింగ్‌ వేసే సమయంలో బంతి బౌలర్‌ చేతి నుంచి విడుదల కాకముందే నాన్‌స్ట్రయిక్‌ బ్యాటర్‌ పరుగు పెడితే బౌలర్‌ వికెట్లను గిరాటేయడమే మన్కడింగ్‌. ఐపీఎల్‌లో బట్లర్‌ను అశ్విన్‌ ఇలా అవుట్‌ చేస్తే పాశ్చత్య క్రికెటర్లు అతనిపై ధ్వజమెత్తారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని నానాయాగీ చేశారు. క్రికెట్‌ చట్టాలు చేసే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్‌లో రనౌట్‌! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్‌ కాదని పేర్కొంది.

T20 Highest Wicket Taker : 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా..

అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు కానున్న కొత్త‌ రూల్స్‌ ఇవే..

ICC T 20 World Cup 2022

☛ ఉమ్మిపై నిషేధం
☛ బంతిని మెరిసేలా చేసేందుకు బౌల‌ర్లు ఉమ్మి రాయడం తెలిసిందే. అయితే ఇటీవ‌ల కోవిడ్ వ‌ల్ల బంతికి ఉమ్మిరాయ రాదు అని ఓ నిషేధాన్ని విధించారు. తాత్కాలికంగా రెండేళ్ల పాటు ఆ నిషేధం కొన‌సాగింది. అయితే ఇప్పుడు ఆ నిషేధాన్ని ప‌ర్మినెంట్ చేసేశారు. ఉమ్మి బదులుగా ఇటీవ‌ల ప్లేయ‌ర్లు.. చెమ‌టతో బంతిని మెరిసేలా చేస్తున్నారు. ఆ ఫార్ములా వ‌ర్కౌట్ అయిన‌ట్లు తెలుస్తోంది.
☛ క్యాచ్‌ అవుట్‌ అయిన బ్యాటర్‌ సగం పిచ్‌ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్‌ చేయాలి. ఓవర్‌ చివరిబంతికి ఔటైతే తప్ప.. సగం పిచ్‌ దాటిన నెపంతో నాన్‌ స్ట్రయికర్‌ బ్యాటింగ్‌ చేయడానికి వీలులేదు.
☛ ఫీల్డింగ్‌ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్‌ భారీషాట్‌ ఆడినపుడు బ్యాటింగ్‌ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్‌ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్‌ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్‌) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు.

Ben Stokes: వన్డే క్రికెట్ కు బెన్‌ స్టోక్స్‌ గుడ్‌బై

టీ-20 వరల్డ్‌ కప్ భారత జట్టు ఇదే..

T 20 World Cup India Team

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల (అక్టోబర్‌) 16 నుంచి ప్రారంభంకానున్న టీ-20 వరల్డ్‌ కప్‌ కోసం భారత జట్టును సెలెక్టర్లు కొద్ది సేపటి కిందే ప్రకటించారు.15 మంది సభ్యుల భారత బృందానికి రోహిత్‌ శర్మ నాయకుడిగా, కేఎల్‌ రాహుల్‌ ఉప నాయకుడిగా వ్యవహరించనున్నారు. ఆసియా కప్‌-2022లో పాల్గొన్న భారత జట్టునే సెలెక్టర్లు యధాతథంగా కొనసాగించారు. బుమ్రా, హర్షల్‌ పటేల్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. 15 మంది సభ్యుల్లో ఉంటారనుకున్న మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌కు మరోసారి మొండిచెయ్యి ఎదురైంది. వీరిని స్టాండ్‌ బై సభ్యులుగా ఎంపిక చేశారు సెలెక్టర్లు.

ICC ODI Player Rankings బుమ్రా మళ్లీ నంబర్‌వన్‌

టీ‍-20 వరల్డ్‌ కప్‌ 2022 టీమిండియా ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్

స్టాండ్‌ బై సభ్యులు వీరే.. 
మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్‌

రానున్న ఐదేళ్లలో భారత పురుషుల క్రికెట్‌ జట్టు షెడ్యూల్‌ ఇదే..

ICC

రాబోయే ఐదేళ్ల కాలంలోనూ భారత పురుషుల క్రికెట్‌ జట్టు బిజీబిజీగా గడపనుంది.2023 నుంచి 2027 వరకు భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమాన్ని (ఎఫ్‌టీపీ) అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆగస్టు 17వ తేదీన విడుదల చేసింది.
☛ ఐసీసీలో శాశ్వత సభ్యత్వం ఉన్న 12 దేశాలు రాబోయే ఐదేళ్లలో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టి20లతో కలిపి మొత్తం 777 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
☛ భారత జట్టు విషయానికొస్తే టీమిండియా 38 టెస్టులు, 42 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లతో కలిపి మొత్తం 141 మ్యాచ్‌ల్లో పోటీపడనుంది. అయితే ఈ ఐదేళ్లలో భారత్, పాకిస్తాన్‌ మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌ లేకపోవడం గమనార్హం. ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీలలోనే తలపడతాయి.
☛ ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌ జట్లతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లు ఆడుతుంది. ఆ్రస్టేలియాతో ఇప్పటివరకు నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ ఆడేది. 1991 తర్వాత మళ్లీ ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది.

Cricket: ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు?

Asia Cup T20 Cricket: శ్రీలంక ‘సిక్సర్‌’.. ఆరోసారి ఆసియా కప్‌ సొంతం

Published date : 20 Sep 2022 03:51PM

Photo Stories