ICC ODI Player Rankings బుమ్రా మళ్లీ నంబర్‌వన్
భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ ర్యాంకుకు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జూలై 13న విడుదల చేసిన వన్డే బౌలర్ల ర్యాంకుల్లో టీమిండియా సీనియర్ సీమర్ 718 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో నిలిచాడు. బౌల్ట్ (712), షాహిన్ అఫ్రిది (681) వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. గతంలో రెండేళ్లకు పైగా అగ్రస్థానంలో నిలిచిన భారత బౌలర్‌గా ఘనత వహించిన బుమ్రా 2020 ఫిబ్రవరిలో బౌల్ట్ (కివీస్)కు టాప్ ర్యాంకును కోల్పోయాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో చెలరేగిపోయిన భారత పేసర్ మళ్లీ రెండేళ్ల అనంతరం టాప్ ర్యాంకు అందుకున్నాడు. గతంలో(2017) టి20 బౌలింగ్ విభాగంలో అతను టాప్ ర్యాంకులో నిలిచాడు. ప్రస్తుతం 27వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇప్పుడు భారత్ తరఫున భువనేశ్వర్ మాత్రమే టి20 బౌలర్ల జాబితాలో టాప్–10లో (ఏడో ర్యాంకులో) ఉన్నాడు. వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి (803), రోహిత్ శర్మ (802) వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో చివరి టి20లో అద్భుత సెంచరీ సాధించిన సూర్యకుమార్ యాదవ్ ఏకంగా 44 స్థానాలు ఎగబాకటం విశేషం. తాజా ప్రదర్శనతో అతను ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
Also read: Women's Hockey World Cup 2022: మహిళల ప్రపంచ కప్ హాకీలో 9వ స్థానంలో భారత్
మూడో స్థానానికి టీమిండియా
వన్డే జట్ల ర్యాంకుల్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను వెనక్కినెట్టి మూడో ర్యాంకులోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించడంతో టీమిండియా 108 పాయింట్లతో టాప్–3లో నిలిచింది. దీంతో పాక్ (106) నాలుగో స్థానానికి పడిపోయింది. ఇందులో న్యూజిలాండ్ (126) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ (122) రెండో ర్యాంకులో ఉంది.
Also read: Shooting World Cup:ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో అర్జున్ కి స్వర్ణం