Ben Stokes: వన్డే క్రికెట్ కు బెన్ స్టోక్స్ గుడ్‌బై
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడైన ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ మున్ముందు రెండు ఫార్మాట్‌లకే పరిమితం కానున్నాడు. వన్డేల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు స్టోక్స్ ప్రకటించాడు. జూలై 18న ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి వన్డే స్టోక్స్‌కు చివరిది కానుంది. టెస్టు క్రికెట్‌కు తన ప్రాధాన్యత అని, టి20ల్లో కూడా ఆడతానని స్టోక్స్ వెల్లడించాడు.
Also read: IDF Masters Chessలో రన్నరప్ గా హర్ష భరతకోటి
104 వన్డేల్లో 39.44 సగటుతో 2,919 పరుగులు చేసిన స్టోక్స్ 3 సెంచరీలు, 21 అర్ధసెంచరీలు సాధించాడు. 41.79 సగటుతో 74 వికెట్లు కూడా పడగొట్టాడు. స్టోక్స్ కెరీర్‌లో అత్యుత్తమ క్షణం 2019 వన్డే వరల్డ్‌కప్ గెలవడం. ఈ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అయిన స్టోక్స్ 98 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు ‘సూపర్ ఓవర్’లో 3 బంతుల్లో 8 పరుగులు సాధించాడు.
Also read: 2022 World Athletics Championships: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో షెల్లీకి 5వ స్వర్ణం
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP