ICC 2022 World Cup : మరో సంచలనం.. పాక్‌కు జింబాబ్వే భారీ షాక్
131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. దీంతో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది.
T20 World Cup 2022 : పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ ఇదే..
మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ ఇదే..
ఆఖరి వరకు పోరాడిన జింబాబ్వే అద్బుత ఆటతీరుతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ 44 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మహ్మద్ నవాజ్ 22 పరుగులు, మహ్మద్ వసీమ్ 12 పరుగులు నాటౌట్ చేశారు. జింబాబ్వే బౌలింగ్‌లో సికందర్ రజా 3, బ్రాడ్ ఎవన్స్ 2 వికెట్లు తీశారు. పాకిస్తాన్ మూలాలున్న సికందర్ రజా మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి పాకిస్తాన్‌ను దెబ్బ తీశాడు.
T20 World Cup 2022 Records : వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..
India vs Pakistan T20 World cup : పాక్‌పై భారత్ ఘన విజయం.. ఉత్కంఠ పోరు సాగిందిలా..
జింబాబ్వే కనీసం పోరాడే స్కోరును..
అంతకముందు జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో బ్రాడ్ ఎవన్స్ 19, రెయాన్ బర్ల్ 10 నాటౌట్ పరుగులు చేయడంతో జింబాబ్వే కనీసం పోరాడే స్కోరు చేయగలిగింది. 93/3తో కాస్త మెరుగైన స్థితిలో కనిపించిన జింబాబ్వే రెండు పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ వసీమ్ 4, షాదాబ్ ఖాన్ 3, హారిస్ రౌఫ్ ఒక వికెట్ తీశాడు.
India vs Pakistan T20 World cup : పాక్‌పై భారత్ ఘన విజయం.. ఉత్కంఠ పోరు సాగిందిలా..