Skip to main content

T20 World Cup 2022 Records : వెటరన్‌ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ సరికొత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..

అంతర్జాతీ టీ20ల్లో టీమిండియా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన ఘనత సాధించాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా భువీ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా ఆదివారం(ఆక్టోబర్‌ 23) చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహిన్‌ ఆఫ్రిదిని ఔట్‌ చేసిన భువీ.. తన 86వ టీ20 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

తద్వారా ఈ అరుదైన ఘనతను భువీ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు టీ20 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్‌ 86 వికెట్లు సాధించాడు. అంతకుముందు ఈ  రికార్డు టీమిండియా  స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌(85) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చాహల్‌ రికార్డును భువీ బ్రేక్‌ చేశాడు.

Published date : 25 Oct 2022 01:38PM

Photo Stories