Skip to main content

Asian Games 2023 Squash: స్క్వాష్‌ సింగిల్స్‌ డబుల్స్‌లో భార‌త్‌కు ప‌త‌కాలు

భారత స్క్వాష్‌ స్టార్‌ సౌరవ్‌ ఘోషాల్‌ వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిశాడు.
 Asian Games 2023 Squash,Sourav holding his silver medal in men's squash singles at the 2023 Asian Games.
Asian Games 2023 Squash

గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 37 ఏళ్ల సౌరవ్‌ 11–9, 9–11, 5–11, 7–11తో ఇఐన్‌ యో ఎన్జీ (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు. 2006 దోహా ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసి కాంస్యం నెగ్గిన సౌరవ్‌.. ఆ తర్వాత 2010లో కాంస్యం, 2014లో రజతం, 2018లో కాంస్యం సాధించాడు. 

Asain Games 2023 Archery: ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణం

తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపిక పల్లికల్‌–హరీందర్‌పాల్‌ జోడీ (భారత్‌) స్వర్ణ పతకం గెలిచింది. ఫైనల్లో దీపిక–హరీందర్‌పాల్‌ ద్వయం 11–10, 11–10తో ఐఫా బింతి అజ్మన్‌–కమాల్‌ (మలేసియా) జంటపై నెగ్గింది.  

Asian Games 2023 Archery: ఆర్చరీలో భారత జట్లకు స్వర్ణ పతకాలు

 

Published date : 06 Oct 2023 02:50PM

Photo Stories