Skip to main content

Asian Games 2023 Archery: ఆర్చరీలో భారత జట్లకు స్వర్ణ పతకాలు

చైనా నేలపై భారత బాణం బంగారమైంది. ఆసియా క్రీడల ఆర్చరీ ఈవెంట్‌లో భారత మహిళల కాంపౌండ్‌ జట్టు తొలిసారి స్వర్ణ పతకం సాధించగా... భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు 2014 తర్వాత మళ్లీ పసిడి పతకం సంపాదించింది.
Asian Games 2023 Archery
Asian Games 2023 Archery

ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 230–229తో యి సువాన్‌ చెన్, హువాంగ్‌ ఐజు, లు యున్‌ వాంగ్‌లతో కూడిన చైనీస్‌ తైపీ జట్టును ఓడించి తొలిసారి ఆసియా క్రీడల చాంపియన్‌గా అవతరించింది.  

Asain Games 2023 Archery: ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణం

ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలే, అభిషేక్‌ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు ఫైనల్లో 235–230తో జేహున్‌ జూ, జేవన్‌ యాంగ్, కింగ్‌ జాంగ్‌హోలతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి బంగారు పతకం నెగ్గింది. సెమీఫైనల్లో భారత్‌ 235–224తో చైనీస్‌ తైపీపై, క్వార్టర్‌ ఫైనల్లో 235–221తో భూటాన్‌పై, తొలి రౌండ్‌లో 235–219తో సింగపూర్‌పై గెలుపొందింది. 

Asian Games 2023: రిలే ఈవెంట్‌లో స్వర్ణం

Published date : 06 Oct 2023 01:18PM

Photo Stories