Skip to main content

Asian Games 2023: రిలే ఈవెంట్‌లో స్వర్ణం

పురుషుల 4*400 మీటర్ల రిలే ఈవెంట్‌లో మొహమ్మద్‌ అనస్, అమోజ్‌ జేకబ్, అజ్మల్, రాజేశ్‌ రమేశ్‌లతో కూడిన భారత బృందం స్వర్ణ పతకం గెలిచింది.
Asian Games 2023 relay event
Asian Games 2023 relay event

భారత బృందం 3ని:01.58 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఈ విభాగంలో 61 ఏళ్ల తర్వాత భారత్‌కు మళ్లీ పసిడి పతకాన్ని అందించింది. 1962 ఆసియా క్రీడల్లో మిల్కా సింగ్, మఖన్‌ సింగ్, దల్జీత్‌ సింగ్, జగదీశ్‌ సింగ్‌ బృందం చివరిసారి 4*400 మీటర్ల రిలేలో భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది.

Asian Games 2023 Athletes: ఆసియా క్రీడల్లో భార‌త అథ్లెట్లు జోరు

మరోవైపు ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశ్, ప్రాచీ, విత్యా రామ్‌రాజ్‌లతో కూడిన భారత మహిళల జట్టు 4*400 మీటర్ల రిలేలో రజత పతకంతో (3ని:27.85 సెకన్లు) సరిపెట్టుకుంది. పురుషుల 5000 మీటర్ల విభాగంలో అవినాశ్‌ సాబ్లే (13ని:21.09 సెకన్లు) రజత పతకం గెలిచాడు. మహిళల 800 మీటర్ల ఫైనల్‌ రేసును భారత అథ్లెట్‌ హర్‌మిలన్‌ బైన్స్‌ 2ని:03.75 సెకన్లలో పూర్తి చేసి రజత పతకంకైవసం చేసుకుంది. 35 కిలోమీటర్ల నడక మిక్స్‌డ్‌ విభాగంలో మంజు రాణి, రాంబాబు జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.  

Asian Games 2023 Javelin Throw: నీరజ్ చోప్రాకు స్వర్ణం

Published date : 06 Oct 2023 01:25PM

Photo Stories