National Teachers Awards 2024: ఉత్తమ అధ్యాపకురాలు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం.. నగదు బహుమతి ఎంతో తెలుసా?
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ నందవరం మృదులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ అధ్యాపకురాలి అవార్డును ప్రదానం చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు.
హైదరాబాద్ బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ప్రొఫెసర్‌గా మృదుల పనిచేస్తున్నారు.
చదవండి: Ravi Varma: నిత్య విద్యార్థి.. ఈ ఉపాధ్యాయుడు
మృదులతో పాటు తాడూరి సంపత్‌కుమార్ (రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జెడ్పీ స్కూల్), పీసర ప్రభాకర్‌రెడ్డి (ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జెడ్పీ స్కూల్) జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి నుంచి అందుకున్నారు.
అవార్డులకు ప్రశంసాపత్రంతో పాటు రూ.50 వేల నగదు బహుమతిని రాష్ట్రపతి అందజేశారు.
Published date : 06 Sep 2024 03:05PM
Tags
- National Teachers Awards 2024
- Ministry of Education
- President Draupadi Murmu
- Vigyan Bhawan
- Certificate of Merit
- Award of Rs 50000
- silver medal
- Prime Minister
- Dr Mrudula Nandavaram
- Associate Professor
- Begumpet Government Degree College for Women
- Head of the Telugu Department
- Taduri Sampath Kumar
- Dammannapet ZP School
- Peesara Prabhakar Reddy
- Tirumalayapalem ZP School