Droupadi Murmu: మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్
Sakshi Education
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 29వ తేదీ రాష్ట్రపతి భవన్‌లో ‘ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ ప్రొబేషనర్ల’ను ఉద్దేశించి మాట్లాడారు.
భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధిస్తోందని, త్వరలోనే ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ముర్ము తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థ: భౌగోళిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని ప్రదర్శిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
2047 అంచనా: 2047కి ఆర్థిక వ్యవస్థ పది రెట్లు పెరుగుతుందని, ఈ సీటీ ద్వారా భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పారు.
విదేశీ పెట్టుబడులు: భారత ప్రభుత్వం మదుపర్లను ఆకర్షించేందుకు స్నేహపూర్వక విధానాలను అవలంబిస్తూ, 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్‌గా తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు వివరించారు.
Census of India: 2025లో దేశ జనాభా గణన.. మారిపోనున్న జనగణన సైకిల్!
Published date : 01 Nov 2024 09:48AM