Skip to main content

Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు

ప్యారిస్ వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త్ ఖాతాలో మ‌రో రెండు ప‌త‌కాలు వ‌చ్చి చేరాయి.
Nishad claims silver, Preethi wins bronze for India in Paralympics

పురుషుల హైజంప్ టీ47 ఈవెంట్‌లో నిషాద్ కుమార్ ర‌జ‌త ప‌త‌కం సాధించాడు. ఫైనల్లో అతను 2.04 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచాడు. 

మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ35 విభాగంలో ప్రీతీ పాల్ కాంస్యంతో మెరిసింది. కాగా ప్రీతీ 100 మీట‌ర్ల‌ టీ35 పరుగు పందెంలో కూడా బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకుంది.

టీ35 పరుగులో కాంస్యం గెలిచిన ప్రీతి పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారత స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఇప్పటివరకు పారిస్ పారాలింపిక్స్‌లో భార‌త్ గెలిచిన ప‌త‌కాల సంఖ్య 7కు చేరింది.

Paris Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు 4 పతకాలు..

Published date : 02 Sep 2024 06:28PM

Photo Stories