Skip to main content

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టుకు స్వర్ణ పతకం

ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్‌ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్‌ జట్లు బరిలోకి దిగలేదు.
Asian Games 2023,Indian women's cricket team ,Historic gold win for Indian women's cricket at Asian Games 2023
Asian Games 2023

దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్‌ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్‌ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది.

Rohit Sharma brake Sachin's record: ఆసియాకప్‌లో సచిన్‌ రికార్డు బద్దలుకొట్టిన‌ రోహిత్‌ శర్మ

బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్‌లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్‌ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో భారత్‌ పోటీపడింది. 

India World Cup 2023 Squad: వన్డే ప్రపంచకప్‌-2023 భారత జట్టు ఇదే..

Published date : 27 Sep 2023 09:32AM

Photo Stories