Skip to main content

Alzheimer’s Disease: మతిమరుపు బాధితులకు ‘లెసానెమాబ్‌’

మనుషుల్లో వయసు పెరుగుతున్నకొద్దీ మతిమరుపు (అల్జీమర్స్‌) తలెత్తడం సహజం. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా దీనితో బాధపడుతున్నారని అంచనా.

బ్రిటన్లోని అల్జీమర్స్‌ రీసెర్చ్‌ సంస్థ లెసానెమాబ్‌ పేరుతో నూతన ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీనితో మతిమరుపు పెరుగుదల నెమ్మదిస్తుందని సైంటిస్టులు చెప్పారు. అల్జీమర్స్‌ చికిత్సలో ఇదొక కీలక మలుపన్నారు.
క్లినికల్‌ ట్రయల్స్‌లో 1,795 మందిపై సంతృప్తికరమైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. వారికి 18 నెలలపాటు చికిత్స అందిస్తే మతిమరుపు పెరుగుదల నాలుగింట మూడొంతులు తగ్గిపోతుందని చెప్పారు. అల్జీమర్స్‌కు ప్రధాన కారణమైన బీటా–అమైలాయిడ్‌ అనే ప్రొటీన్‌ను ఈ ఔషధం కరిగించేస్తుందని పేర్కొన్నారు. మెరుగైన అల్జీమర్స్‌ చికిత్సల కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని, ఈ దిశగా లెసానెమాబ్‌ డ్రగ్‌ ఒక ఉత్తమమైన పరిష్కారం అవుతుందని పరిశోధకుడు ప్రొఫెసర్‌ జాన్‌ హర్డీ తెలియజేశారు.   

మరణమృదంగం.. ఐదు బ్యాక్టీరియాలకు.. 77 లక్షల మంది బలి

Published date : 01 Dec 2022 04:49PM

Photo Stories