Collector Pamela Satpathy: సర్కారు విద్యార్థులకు సువర్ణావకాశం
కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాద్‌రావు మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు పాఠశాల, మండల, జిల్లాస్థాయిలో ప్రసంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు ప్రపంచస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి పారమిత విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎడ్, టెడ్ టాక్స్ నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న 20మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది పారమిత టెడ్‌క్లబ్ వారు శిక్షణ ఇస్తారు.
విద్యార్థులు ఎంచుకున్న విషయాల్లో సమగ్ర అధ్యయనం, పుస్తక పఠనం, పరిశోధనలు, బహుకరణలో మెలకువలు నేర్పిస్తా రు. ఎంపికై నవారికి పుస్తకాలు, అంతర్జాల సౌకర్యం, ఉచిత భోజన, వసతి కల్పిస్తారు. ఈ ఒప్పందం మూడేళ్లపాటు అమలులో ఉంటుంది. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ టెడ్ వేదికగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి అంకురార్పణ జరిగిందన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో జనార్దన్‌రావు పాల్గొన్నారు.
చదవండి: Naveen Kumar Sucess Story: 27 సార్లు ప్రయత్నించి విఫలప్రయత్నం..! చివరకు ఎస్సైగా ఎంపికై..
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాపోటీల్లో రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అక్టోబర్ 23న కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో గ్రంథాలయం ప్రారంభించి, విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు.
క్రీడా పాఠశాల విద్యార్థులకు ప్రతీవారం తప్పనిసరిగా ఒక సందేశాత్మక సినిమా చూపించాలని అధికారులకు సూచించారు. త్వరలో క్రీడా పరికరాలు, దుస్తులు అందిస్తామన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్, నెహ్రూ యువ కేంద్రం కో– ఆర్డినేటర్ వెంకట రాంబాబు, హెచ్‌ఎం లీలాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.