Data Science: డేటా సైన్స్‌లో విస్తృత పరిశోధనలు చేయాలి..
చేబ్రోలు: విద్యార్థులు డేటా సైన్స్‌పై విస్తృత పరిశోధనలు చేయాలని ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ మేథమ్యాటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న కాన్ఫరెన్స్‌ను హైబ్రిడ్ మోడ్‌లో (ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్) గురువారం ప్రారంభమైంది.
Anganwadi on Duty: అంగన్వాడీలను సత్వరమే విధుల్లోకి తీసుకోవాలి..
ముఖ్య అతిథిగా హాజరైన ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ రాజశేఖర్ మాట్లాడుతూ మేథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్‌లో ప్రావీణ్యం పొందిన విద్యార్థులు భవిష్యత్‌లో డేటాసైన్స్‌ను పరిశోధనాంశంగా ఎంచుకోవాలన్నారు. ప్రస్తుతం అన్ని మల్టీ నేషనల్ కంపెనీలు డేటాసైన్స్‌ను విరివిగా వినయోగిస్తున్నారని తెలిపారు. ఇందులో ప్రావీణ్యం పొందిన విద్యార్థులకు మంచి డిమాండ్ ఉంటుందన్నారు. విజ్ఞాన్ వీసీ పి.నాగభూషణ్ మాట్లాడుతూ విద్యార్థులు అప్‌డేట్ అయితేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరని, నిరంతర అధ్యయనం కొనసాగాలని సూచించారు.
Environment Protection: పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికి ఐక్య రాజ్య సమితి ప్రశంసలు..
ఆన్‌లైన్‌లో ముఖ్య అతిథిగా హాజరైన సౌది అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నబిల్ మలైకీ విద్యార్థులకు ఆల్‌జీబ్రాలో వస్తున్న సరికొత్త డెవలప్‌మెంట్స్‌ను నిత్యజీవితంలో ఎలా వినియోగించాలో తెలియజేశారు. లెబనాన్‌లోని లెబనీస్ అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జుల్కర్‌మైన్ సబిర్ విద్యార్థులకు న్యూమరల్ నెట్‌వర్క్ సిస్టమ్‌లోని మెళకువలను వివరించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Ap Ministers: ఏపీ కొత్త మంత్రులు వీరే.. వారికి కేటాయించిన శాఖలు ఇవే..
Tags
- data science
- Research
- Students
- detailed research
- Vadlamudi Vigyan University
- Emerging Trends in Mathematics and Scientific Computing
- hybrid conference
- IIT Professor Rajshekar
- Multi National Companies
- extensive research on data science
- future benefits with data science
- Education News
- Sakshi Education News
- Guntur District News
- hybrid conference
- online offline mode
- IIT Kharagpur
- G.P. Rajasekhar
- SakshiEducationUpdates