Skip to main content

Environment Protection: ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు చేస్తున్న కృషికి ఐక్య రాజ్య స‌మితి ప్ర‌శంస‌లు..

ఆర్‌జీయూకేటీ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది.
RGUKT Srikakulam campus green initiative  United Nations appreciates Rajiv Gandhi University of Science and Technology for their efforts in environment protection

ఎచ్చెర్ల క్యాంపస్‌: శ్రీకాకుళం రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ) శ్రీకాకుళం క్యాంపస్‌ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. జూన్‌ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని తెలియజేయాలని ఐక్యరాజ్య సమితి కోరింది. ఈ మేరకు గో గ్రీన్‌ పేరిట పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, మొక్కలు నాటుతున్న ఫొటోలను సంస్థ అధికారులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు.

PG Semester Exams: ఈనెల 28 నుంచి పీజీ రెండు, నాలుగు సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు..

ఈ మేరకు సంస్థ పనితీరును ప్రశంసిస్తూ గురువారం ఐక్యరాజ్య సమితి సందేశం పంపింది. బయోసైన్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫె సర్‌ గేదెల రవి, ఇతర జాతీయ సేవాపథకం పీఓలను డైరెక్టర్‌ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీ, ఏఓ మునిరామకృష్ణతో కూడిన అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో మొక్కలు నాటారు.

Openschool Results:ఓపెన్‌ ఇంటర్‌, ఎస్సెస్సీ ఫలితాలు విడుదల

Published date : 15 Jun 2024 08:52AM

Photo Stories