Google Duet AI: ఈ కొత్త టెక్నాలజీతో మీటింగులకు అటెండ్ కావలసిన అవసరం లేదా ?
ఇప్పటివరకు ఇది సబ్‌స్క్రయిబర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు సమావేశాల్లో వ్యక్తిగతంగా పాల్గొనాల్సిన అవసరం లేకుండా, వారి తరఫున ఇది హాజరు కాగలదు.
‘ఇది సమావేశాలకు సంబంధించి సహాయకుడిగా పని చేస్తుంది. టేక్ నోట్స్ ఫర్ మి ఫీచర్‌తో ఇది వివరాలను నోట్ చేసుకుంటుంది. మీరు కాస్త ఆలస్యంగా సమావేశానికి వచ్చినా మీకు ఇబ్బంది ఎదురవకుండా ఇది సహాయపడుతుంది. అలాగే ఆస్క్ టు అటెండ్ ఫర్ మి ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. ఏకకాలంలో రెండు చోట్ల మీరు ఉండాల్సిన పరిస్థితి తలెత్తితే సమావేశంలో పాల్గొనాలంటూ డ్యూయెట్‌కు చిన్న సూచన ఇస్తే చాలు. మిగతా సభ్యులకు సైతం ఆ సందేశాన్ని తెలియజేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. కాల్ పూర్తయిన తర్వాత డ్యూయెట్ మీకు ఆటోమేటిక్‌గా నోట్స్ కూడా పంపిస్తుంది‘ అని గూగుల్ వర్క్‌స్పేస్ వీపీ క్రిస్టినా బెహర్ తెలిపారు.
Google Accounts: గూగుల్ అకౌంట్ వాడట్లేదా... అయితే మీ అకౌంట్ ఇక డిలీటే!
డ్యూయెట్ 300 పైచిలుకు భాషలను గుర్తించగలదని, సహాయం అందించగలదని పేర్కొన్నారు. మరోవైపు, గూగుల్ క్లౌడ్ జెన్ ఏఐని ఉపయోగించుకోవడంలో కస్టమర్లకు సహాయపడేందుకు యాక్సెంచర్, క్యాప్‌జెమిని, డెలాయిట్, విప్రో సంస్థలు 1.5 లక్షల మంది నిపుణులకి శిక్షణ ఇవ్వనున్నట్లు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఒక ప్రకటనలో తెలిపారు.