Skip to main content

Google Accounts: గూగుల్‌ అకౌంట్ వాడ‌ట్లేదా... అయితే మీ అకౌంట్ ఇక డిలీటే!

మీ జీ మెయిల్‌ అకౌంట్‌ను ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఇక శాశ్వతంగా డిలీట్‌ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్‌ 1 నుంచి గూగుల్‌ అందుబాటులోకి తెస్తోంది.
Recent Activity Check, Google Accounts, Compromised Gmail Account, Permanently Delete Account,
గూగుల్‌ అకౌంట్ వాడ‌ట్లేదా... అయితే మీ అకౌంట్ ఇక డిలీటే!

దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్‌ ఈ వారమే తన యూజర్లందరికీ మెయిల్స్‌ పంపింది. తాను అందించే అన్ని సరీ్వసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘మా యూజర్లు అకౌంట్‌ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్‌ డిలీషన్‌ అందులో భాగమే’’ అని గూగుల్‌ ప్రకటించింది.  

ఇవీ చ‌ద‌వండి: ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుద‌ల‌... మెరిట్‌లిస్ట్ కోసం క్లిక్ చేయండి.!

వీటికి వర్తిస్తుంది...  
గూగుల్‌ అకౌంట్‌ను రెండేళ్ల పాటు సైన్‌ ఇన్‌ చేయకపోతే, వాడకపోతే.
ఒకసారి డిలీట్‌ చేసిన అకౌంట్‌ తాలూకు జీ మెయిల్‌ అడ్రస్‌ను ఇంకెవరికీ కేటాయించబోరు.
సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్‌ చేస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది.
అయితే అకౌంట్‌ను డిలీట్‌ చేసే ముందు గూగుల్‌ పలుమార్లు రిమైండర్‌ మెయిల్స్‌ పంపుతుంది. అవి సదరు అకౌంట్‌తోపాటు యూజర్‌ తాలూకు రికవరీ అకౌంట్‌కు కూడా వెళ్తాయి.
ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్‌ రావడం మొదలవుతుంది.

google

ఇవీ చ‌ద‌వండి: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఫ‌స్ట్ ర్యాంక‌ర్‌.. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష.. స‌క్సెస్ స్టోరీ..

మీ గూగుల్‌ అకౌంట్‌ యాక్టివ్‌గా ఉండాలంటే...
తరచూ లాగిన్‌ అవుతూ ఉన్నా...
కనీసం రెండేళ్లకు ఒకసారైనా లాగిన్‌ అయినా...
గూగుల్‌ డ్రైవ్‌ వాడినా...
మెయిల్‌ పంపినా, చదివినా...
యూట్యూబ్‌లో వీడియో చూసినా...
ఏ గూగుల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసినా...
థర్డ్‌ పార్టీ యాప్, సరీ్వస్‌ లను గూగుల్‌ ద్వారా సైన్‌ ఇన్‌ చేసినా మీ గూగుల్‌ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదు.

G Mail

ఇవీ చ‌ద‌వండి: సెప్టెంబ‌ర్ 1 నుంచి ఖమ్మంలో అగ్నివీర్ నియామక ర్యాలీ.....!

మినహాయింపులున్నాయ్‌..
గూగుల్‌ అకౌంట్‌ డిలీషన్‌ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని అకౌంట్లను డిలీట్‌ చేసే కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు  
యూట్యూబ్‌ చానల్స్, ఖాతాకు, కామెంట్లున్న గూగుల్‌ అకౌంట్‌
డబ్బులతో కూడిన గిఫ్ట్‌ కార్డులున్న జీ మెయిల్‌ అకౌంట్‌
పబ్లిషిడ్ అప్లికేషన్‌ ఉన్న అకౌంట్‌   

Published date : 22 Aug 2023 12:44PM

Photo Stories