Skip to main content

Agniveer: సెప్టెంబ‌ర్ 1 నుంచి ఖమ్మంలో అగ్నివీర్ నియామక ర్యాలీ... ఈ డాక్యుమెంట్లు లేక‌పోతే ఇంటికే..!

సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి ఖమ్మంలో అగ్నివీర్‌ సైన్యం నియామక ర్యాలీ జరగనుంది. స్థానిక‌ సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అభ్యర్థులకు ఫిజికల్​ టెస్టులు, వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో 1.6 కిలోమీటర్ల రన్నింగ్, పుల్ అప్స్, 8 ఫీట్ డిక్, జిగ్ జాగ్ నిర్వ‌హిస్తారు.
Agniveer
సెప్టెంబ‌ర్ 1 నుంచి ఖమ్మంలో అగ్నివీర్ నియామక ర్యాలీ... ఈ డాక్యుమెంట్లు లేక‌పోతే ఇంటికే..!

అగ్నివీర్‌ తొలివిడత రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని సూర్యాపేట జిల్లాలో 17 రోజుల పాటు నిర్వహించగా.. సుమారు 45 వేలమంది హాజరయ్యారు. తాజాగా రెండో విడతలో ఖమ్మంలో ఫిజికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సైనిక రిక్రూట్‌మెంట్‌ అధికారి కల్నల్‌ కీట్స్‌ కె దాస్.. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌లతో భేటీ అయ్యారు.  

ఇవీ చ‌ద‌వండి: ఫ‌స్ట్ అటెంప్ట్‌లోనే ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంకు... 22 ఏళ్ల‌కే ఐఏఎస్ సాధించిన అంకుర్ గార్గ్‌

ఏప్రిల్ 17 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన ఆన్‌లైన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌లో 7,397 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట్రం యూనిట్​గా ప్రతి యేటా ఒక జిల్లాలో రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించే విధానంలో భాగంగా ఈ సారి అవకాశం ఖమ్మం జిల్లాకు దక్కింది. గతేడాది సూర్యాపేటలో మొదటి అగ్నివీర్​ర్యాలీ జరిగింది. అవసరమైన డాక్యుమెంట్లు తీసుకురాని కారణంగా, అప్పుడు 3 వేల మంది ర్యాలీలో పాల్గొనే చాన్స్ కోల్పోయారు. దీంతో మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని రిక్రూట్ మెంట్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. 

Agniveer

1వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల నుంచే ర్యాలీ మొదలవుతుంది. ర్యాలికి హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లలో అభ్యర్థి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఒకే విధంగా ఉండాలి. పదో తరగతి సర్టిఫికెట్​పై ఉన్న వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటారు.

ఇవీ చ‌ద‌వండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌... భారీ డీల్ ద‌క్కించుకున్న టెక్ దిగ్గ‌జం.!

ఈ డాక్యుమెంట్లు త‌ప్ప‌నిస‌రి...!
- అడ్మిట్ కార్డు (ఒరిజినల్​కాపీతో పాటు జిరాక్స్​) 
- ఎడ్యుకేషనల్​ సర్టిఫికెట్లు (ఒరిజినల్​ మార్క్స్​షీట్, పాస్​సర్టిఫికెట్​తో పాటు రెండు సెట్ల జిరాక్స్) 
- 20 పాస్​పోర్టు సైజ్​కలర్​ఫొటోలు 
- అఫిడవిట్ (రూ.10 నాన్​ జ్యుడీషియల్​ స్టాంప్​ పేపర్ ​మీద నోటిఫికేషన్​లో చెప్పిన ఫార్మాట్ లో నోటరీ చేయించాలి) 
- నేటివిటీ/ రెసిడెన్స్ ​సర్టిఫికెట్, కమ్యూనిటీ/ క్యాస్ట్​ సర్టిఫికెట్​(ఫొటోతో పాటు తహసీల్దార్ ​జారీ చేసినవి. ఒరిజినల్స్​తో పాటు రెండు సెట్ల జిరాక్స్​లు) 
- రిలిజియన్ ​సర్టిఫికెట్ (కమ్యూనిటీ సర్టిఫికెట్​లో రిలిజియన్​ లేకపోతే ఇది ప్రత్యేకంగా తీసుకోవాలి. తహసీల్దార్​జారీ చేసినది. ఒరిజినల్​తో పాటు రెండు జిరాక్స్​లు)

Agniveer

ఇదీ చ‌ద‌వండి: జ‌స్ట్ పాస్ మార్కుల‌తో ప‌ది పాస‌య్యా... క‌ట్ చేస్తే ఇప్పుడు క‌లెక్ట‌ర్‌గా సేవ‌లందిస్తున్నా..
- క్యారెక్టర్ సర్టిఫికెట్​(ఫొటోతో పాటు సర్పంచ్ లేదా తహసీల్దార్​ నుంచి తీసుకోవాలి. స్కూల్, కాలేజీ నుంచి కూడా తీసుకోవచ్చు. ఒరిజినల్ తోపాటు రెండు జిరాక్స్​లు)
- అన్ మ్యారీడ్​ సర్టిఫికెట్​(ఫొటోతో పాటు సర్పంచ్​ లేదా మున్సిపాలిటీ నుంచి గత ఆరు నెలలలోపు తీసుకున్నదై ఉండాలి. ఒరిజినల్​తో పాటు రెండు జిరాక్స్​లు) 
- పోలీసులు ఇచ్చే​ క్యారెక్టర్ ​సర్టిఫికెట్​ ( గత ఆర్నెళ్లలోపు తీసుకున్నవి మాత్రమే) 
- ఆధార్​ కార్డు (ఒరిజినల్, రెండు జిరాక్స్​లు)
- పాన్​కార్డు(ఒరిజినల్​, రెండు జిరాక్స్​లు)
- ట్రైబల్​ టాటూ సర్టిఫికెట్​ (గిరిజనులైతే కలెక్టర్ ద్వారా ధ్రువీకరించింది, ఒరిజినల్ తో పాటు రెండు జిరాక్స్​లు) 

Published date : 17 Aug 2023 02:43PM

Photo Stories