Skip to main content

Infosys: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌... భారీ డీల్ ద‌క్కించుకున్న టెక్ దిగ్గ‌జం.!

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ డీల్‌ ప్రకటించింది. వీడియో, బ్రాడ్‌బ్యాండ్‌, కమ్యూనికేషన్ల సంస్థ లిబర్టీ గ్లోబల్‌తో 1.5 బిలియన్‌ యూరోల (సుమారు రూ.13,650 కోట్ల) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు కపెంనీలు సంయుక్త ప్రకటన జారీ చేశాయి.
Infosys
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌... భారీ డీల్ ద‌క్కించుకున్న టెక్ దిగ్గ‌జం.!

తొలుత 5 ఏళ్ల కాలానికి 1.5 బిలియన్‌ యూరోల కాంట్రాక్టు విలువతో లిబర్టీ గ్లోబల్‌కు ఇన్ఫోసిస్‌ సేవలు అందించనుంది. ఆ తర్వాత అవసరమనుకుంటే ఈ సమయాన్ని ఎనిమిదేళ్లకు పొడిగించుకునే అవకాశం ఉంది. అప్పుడు కాంట్రాక్టు విలువ 2.3 బిలియన్‌ యూరో (సుమారు రూ.21,000 కోట్ల) లకు చేరుతుంది. ఇన్ఫోసిస్ ఈ ఏడాది చేసుకున్న మూడో మెగా వ్యాపార ఒప్పందం ఇది. దీంతో దేశీయ ఐటీ పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయనే  ఆనందం ఐటీ వర్గాల్లో నెలకొంది. 

ఇదీ చ‌ద‌వండి: జ‌స్ట్ పాస్ మార్కుల‌తో ప‌ది పాస‌య్యా... క‌ట్ చేస్తే ఇప్పుడు క‌లెక్ట‌ర్‌గా సేవ‌లందిస్తున్నా..

Liberty Global

ఈ ఒప్పందం కింద లిబర్టీ గ్లోబల్‌కు చెందిన ప్రోడక్ట్‌, సాంకేతికత అభివృద్ధి సేవల డెలివరీ గ్రూపు, నెట్‌వర్క్‌, షేర్డ్‌ ఆపరేషన్స్‌, సెక్యూరిటీ గ్రూపులకు చెందిన ఉన్నత ఉద్యోగులు, సాంకేతిక బృందం ఇన్ఫోసిస్‌కు బదిలీ అవుతారు. లిబర్టీ గ్లోబల్‌ తన ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకునే లైసెన్సులు ఇన్ఫోసిస్‌కు ఇస్తుండటంతో కొత్త విపణులకు, కొత్త క్లయింట్లకు సేవలను అందించేందుకు వీలు ఏర్పడుతుంది.

ఇదీ చ‌ద‌వండి: గ్రూప్‌-4 ఫలితాలపై కీలక ప్రకటన.. రిజ‌ల్ట్స్ ఎప్పుడంటే..?

infosys

కాగా, ఇన్ఫోసిస్‌ మేలో బ్రిటిష్ చమురు గ్యాస్ కంపెనీ బీపీ తో 1.5 బిలియన్ల  డాలర్ల డీల్ కుదుర్చుకుంది. జూన్‌లో డాంక్సే బ్యాంక్‌తో 454 మిలియన్ డాలర్లు విలువైన ఒప్పందాన్ని చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఇదీ చ‌ద‌వండి: ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దువుకుని మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఐపీఎస్ సాధించా... 

Published date : 17 Aug 2023 11:02AM

Photo Stories