TSPSC Group 4 : గ్రూప్-4 ఫలితాలపై కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఎప్పుడంటే..?
గతంలో నోటిఫికేషన్ వస్తే భర్తీ ప్రక్రియ ఏళ్లు పట్టేదని.. ఇప్పుడు రెండు నెలల్లో పూర్తి చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి అన్నారు. ఆగస్టు 15వ తేదీన (మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకట్రెండు సమస్యలకు వ్యవస్థనే తప్పు పట్టడం సరికాదన్నారు.
☛➤ TSPSC Group 4 Paper-1 Question Paper With Key 2023 (Click Here)
☛➤ TSPSC Group 4 Paper-2 Question Paper With Key 2023 (Click Here)
అప్పటి కల్లా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి..
గ్రూప్-4 ఫలితాలకు ఇంకా సమయం ఉందని జనార్థన్‌రెడ్డి అన్నారు. ఈ పరీక్షను జూలై 1వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే. మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్-1కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. గ్రూప్-4 ఉద్యోగాల సంఖ్య, పరీక్షకు హాజరైన అభ్యర్థులు సంఖ్య, పరీక్ష పేపర్ ఆధారంగా, Reservation Policy, Previous Year Cutoff Marks, ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల ఇచ్చిన సలహాలు-సూచనలు, వివిధ సర్వేల ఆధారంగా ఈ ఏడాది గ్రూప్-4 కటాఫ్ అంచనాను కింది పట్టికలో ఇస్తున్నాము. ఈ కటాఫ్ మార్కులు కేవలం ఒక అంచనా మాత్రమే. అంతిమంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన కటాఫ్ మార్కులు ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో సుమారు 99 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. జిల్లా, జోనల్ స్థాయిని బట్టి కూడా కటాప్ మార్కులు మారే అవకాశం ఉంటుంది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్
ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల ఇచ్చిన మేరకు.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 కటాప్ మార్కుల అంచనా ఇలా..
Category | Marks |
Unreserved (General) | 200-225 |
Other Backward Caste(OBC) | 180-200 |
Scheduled Caste (SC) | 150-180 |
Scheduled Tribe (ST) | 140-170 |
TSPSC గ్రూప్-4 కటాఫ్ ఎంత..?
☛ TSPSC Group 2 Exam Preparation Tips: గ్రూప్–2.. సక్సెస్ ప్లాన్
Tags
- TSPSC Group-4 Results 2023 Updates
- TSPSC Group-4 Results 2023 News
- TSPSC Chairman B Janardhan Reddy
- tspsc group 4 cutoff marks 2023
- TSPSC Group 4 Results 2023 Date and time
- tspsc group 4 latest new
- TSPSC Group 4 News
- tspsc group 4 results date
- TSPSC Group 4 Result 2023 Release Date
- tspsc group 4 results release date 2023