Skip to main content

Good News: ఫ్రెషర్లకు ఇన్పోసిస్ నియామక పత్రాలు

న్యూఢిల్లీ: క్యాంపస్ నియామకాల్లో భాగంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 1,000 మందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసినట్టు సమాచారం.
Infosys Recruitment Papers for Freshers

అభ్యర్థుల ఆన్బోర్డింగ్ సెప్టెంబర్ చివర లేదా అక్టోబర్ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు. 2022 బ్యాచ్ ఇంజనీరింగ్ గ్రాడ్యు యేట్లు వీరిలో ఉన్నారని ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎస్ఐటీఈఎస్) వెల్లడించింది.

రెండే ళ్లుగా వీరంతా నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని ఎస్ఐటీఈఎస్ ప్రెసిడెంట్ హర్ ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. 'మేము అప్రమత్తంగా ఉంటాం. ఇన్ఫోసిస్ ఈ నిబద్ధ తను గౌరవించడంలో విఫలమైనా, చేరే తేదీని ఉల్లంఘించినా ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడానికి వెనుకాడము' అని హెచ్చరించారు.

చదవండి: Infosys Campus Placements: ఇన్ఫోసిస్‌ ప్లేస్‌మెంట్స్‌.. ఫ్రెషర్స్‌కు ఏటా రూ.9 లక్షల ప్యాకేజీ

2022-23 రిక్రూట్మెంట్ డ్రైవ్ సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్బోర్డింగ్ చేయ డంలో ఆలస్యం చేసినందుకు ఇన్ఫోసిస్పై కార్మి క, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఎన్ఎస్ఐటీఈఎస్ గతంలో ఫిర్యాదు చేసింది.

ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను కంపెనీ గౌరవిస్తుందని ఇన్ఫో సిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవలే స్పష్టం చేశా రు. ‘కొన్ని నియామక తేదీలను మార్చాం. అం దరూ ఇన్ఫోసిస్ లో చేరతారు. ఆ విధానంలో ఎటువంటి మార్పు లేదు' అని వెల్లడించారు.

Published date : 03 Sep 2024 12:39PM

Photo Stories