Skip to main content

Latest Lecturer jobs: లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Latest Lecturer Posts news
Latest Lecturer Posts news

ఖమ్మం సహకారనగర్‌ : ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి గాను పలు సబ్జెక్టుల బోధనకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సి పాల్‌ మహ్మద్‌ జాకిరుల్లా ఒక ప్రకటనలో తెలిపారు.

తెలుగు, పొలిటికల్‌ సైన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, బీబీ ఏ, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, అప్లికేషన్లలో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఆయా సబ్జెక్టుల్లో జనరల్‌ అభ్యర్థులు 55శాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు.

నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. జిరాక్స్‌ సర్టిఫికెట్లతో కూడిన దరఖాస్తులను ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు కళాశాలలో అందించాలని, 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కళాశాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు.

Published date : 08 Jul 2024 08:10PM

Photo Stories