Skip to main content

Aditya L1 : 178 రోజుల్లో కక్ష్యను చుట్టేసిన ఆదిత్య ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్‌

Aditya L1 spacecraft orbited in 178 days  ISRO maneuvering Aditya L1 spacecraft on halo orbit path

సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్‌ మొట్టమొదటి సారి మండల కక్ష్యను పూర్తి చేసుకుంది. లాగ్రాంగియన్‌ పాయింట్‌ ఎల్‌1 వద్దకు గత ఏడాది సెప్టెంబర్‌ 2వ తేదీన ఆదిత్య ఎల్‌1ను ప్రయోగించారు. నిర్దేశిత హాలో ఆర్బిట్‌లోకి ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ 2024, జనవరి ఆరో తేదీన చేరుకుంది. ఎల్‌1 బిందువు చుట్టూ పరిభ్రమణ చేసేందుకు ఆదిత్య ఎల్‌1కు 178 రోజుల సమయం పడుతుంది. హాలో ఆర్బిట్‌లో భ్రమిస్తున్న సమయంలో ఆదిత్య ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్‌పై వివిధ రకాల శక్తుల ప్రభావం పడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 22, జూన్‌ 7వ తేదీన రెండు సార్లు ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్‌ మాన్యువోరింగ్‌ చేసింది. ఎల్‌1 వద్ద రెండవ హాలో ఆర్బిట్‌ మార్గంలో మూడోసారి మాన్యువోరింగ్‌ మొదలైనట్లు ఇస్రో వెల్లడించింది.

IndiGo Airlines: విజయవాడ-ముంబై ఇండిగో విమాన సర్వీస్.. ఎప్ప‌టినుంచి అంటే..

Published date : 09 Jul 2024 03:28PM

Photo Stories