Skip to main content

Agniveer Job Notification : ‘అగ్నివీర్‌’లో ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ వ‌య‌స్సు గ‌ల‌వారే అర్హులు!

Indian Air Force Recruitment Announcement  Agniveer Scheme Recruitment Notification  District Employment Officer Statement   Job notification from Agniveer Scheme in Indian Air Force  Indian Air Force Agniveer Scheme Notification

ఏలూరు: భారత వాయుసేనలో అగ్నివీర్‌ పథకంలో భాగంగా ఉద్యోగాల నియామకం కోసం భారత వాయుసేన నోటిఫికేషన్‌ విడుదల చేసిందని జిల్లా ఉపాధి అధికారి సి.మధుభూషణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు 2004 జూలై నుంచి 2008 జనవరి మధ్య జన్మించిన స్త్రీ / పురుష అభ్యర్థులు అర్హులన్నారు. మేథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియేట్‌లో, ఒకేషనల్‌ లేదా పాలిటెక్నిక్‌లలో కనీసం 50 శాతం మార్కులతో పాస్‌ అయిన వారు అగ్నిపథ్‌ వెబ్‌ సైట్‌లో ఈ నెల 8వ తేదీ నుంచి 28వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

Rachel Reeves: తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులైన‌ రాచెల్‌ రీవ్స్

ఆన్‌లైన్‌ పరీక్ష అక్టోబర్‌ 10వ తేదీ నుంచి నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులకు ఈ ఉద్యోగాలపై అవగాహన కలుగజేసేందుకు ఈ నెల 12న భీమవరంలోని డీఎన్‌ఆర్‌ డిగ్రీ కాలేజ్‌లో, 16న ఏలూరులోని సర్‌ సీఆర్‌ఆర్‌ రెడ్డి కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాయుసేన సికింద్రాబాద్‌ వారితో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలలని కోరారు.

Job Mela : జిల్లా ఉపాధి కార్యాల‌యంలో రేపు జాబ్ మేళా.. అర్హులు వీరే!

Published date : 10 Jul 2024 09:25AM

Photo Stories