Job Interviews : రేపు జూనియర్ కళాశాలలో జాబ్ మేళా.. ఈ విధంగా!
నెల్లూరు: ఇంటర్ బోర్డు, హెచ్‌సీఎల్ టెక్‌బీ ఆధ్వర్యంలో నగరంలోని డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాలలో ఈ నెల 10న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీ, ఒకేషనల్ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఇంటర్‌లో 75 శాతం ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులని చెప్పారు. జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు క్యాట్ టెస్ట్ నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు.
ఎంపికైన అభ్యర్థులకు టెక్‌బీ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు హెచ్‌సీఎల్ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుందన్నారు. మొదటి 3 నెలలు క్లాసు రూం ట్రైనింగ్ మధురైలో, చివరి 9 నెలలు ఇంటర్న్‌షిప్ చైన్నెలో ఉంటుందన్నారు. ఇంటర్న్‌షిప్ సమయంలో రూ.10 వేలు ఉపకార వేతనం ఇస్తారన్నారు. https://bit.ly/ techbeegoapలో రిజిస్ట్రేషన్ చేసుకోవా ల్సి ఉందన్నారు. మరిన్ని వివరాలకు 77803 23850 నంబరులో సంప్రదించాలన్నారు.
Tags
- Job mela
- interview offers latest
- interviews at junior college
- July 10
- RIO Srinivasulu
- job offers latest
- inter board
- Education News
- Nellore District
- Sakshi Education News
- June 10th
- Job Fair
- Riosrinivasulu
- TechBprogramme
- Eligible criteria
- Cattest
- Checkdetails
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications