Skip to main content

Job Interview : ప్రైవేటు కంపెనీల్లో 270 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా.. ఎప్పుడు?

Job fair on 11th of this month  270 jobs in private companies  Job creation for unemployed youth  District Employment Officer D. Aruna  Job interview for posts at private companies  Vizianagaram job fair announcement

విజయనగరం: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా పలు ప్రైవేటు కంపెనీల్లో 270 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి డి.అరుణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్యూసిన్‌ లిమిటెడ్‌లో 100, హెట్రో ల్యాబ్‌ లిమిటెడ్‌లో 170 ఉద్యోగాల భర్తీకి ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులు విజయనగరం, విశాఖపట్నం, బొబ్బిలి, పార్వతీపురం, రాజాం, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Engineering Seats: అన్‌ రిజర్వుడ్‌ సీట్లు 10 వేలు.. ఈ ఇంజనీరింగ్‌ సీట్లలో ఈ విద్యార్థులకూ చాన్స్‌

ఆసక్తి ఉన్న అభ్యర్థులు వారి పేర్లను employment.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్‌లో ఉన్న శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో గురువారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు విద్యార్హత ఒరిజనల్‌ ధ్రువప్రతాలు, జెరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌ఫొటోలతో హాజరు కావాలన్నారు. వివరాలకు సెల్‌: 89191 79415 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

CUET UG Answer Key 2024 Released: సీయూఈటీ యూజీ ఆన్సర్‌ కీ విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

Published date : 10 Jul 2024 09:07AM

Photo Stories