APPSC Group-I 1st Ranker Bhanusri Success Story: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫస్ట్ ర్యాంకర్.. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష.. సక్సెస్ స్టోరీ..
ఈమె బిఎ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీలో చదివారు. అలాగే ఈమె యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి.. మెయిన్స్‌కు ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్నారు.
సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీలో బాలలత మేడమ్ ఆధ్వర్యంలో.. సెప్టెంబర్ జరిగే యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అదే విధంగా గ్రూప్-1 మెయిన్స్ & ఇంటర్వ్యూకి బాలలతగారి వద్ద ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష.. పశ్చిమ గోదావరి జిల్లాలో కాళ్ల (Kalla) మండలంకి (వీళ్లు ఊరు భీమవరం దగ్గర్లో ఉంటుంది) చెందిన వారు. ఈమె తండ్రి ఉండి దగ్గరల్లోని ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. వీరి కుటుంబంలో ఈమె ఏకైక కూతురు.
ఎడ్యుకేషన్ :
ఈమె స్కూల్ ఎడ్యుకేషన్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే జరిగింది. అలాగే ఇంటర్ మాత్రం తెలంగాణలోని హైదరాబాద్‌లో శ్రీచైతన్య కాలేజీలు చదివారు. ఈమె టెన్త్‌లో 10 కి 10 పాయింట్లు సాధించారు. అలాగే ఇంటర్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 492 మార్కులు సాధించారు. ఇంటర్‌లో ఎంఈసీ గ్రూప్‌లో చేరారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫస్ట్ ర్యాంకర్.. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష పూర్తి ఇంటర్వ్యూ..
☛ APPSC Group 2 Success Plan : ఇలా చదివితే గ్రూప్-2 కొట్టడం ఈజీనే.. | DR. ABDUL KAREEM SIR
ఎంతో ఎఫెక్ట్ పెట్టి చదివా..
ఈమె ఫస్ట్ ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ ర్యాంక్‌తో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం రావడం ఇంకా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ పరీక్షలకు చాలా కష్టపడి చదివానన్నారు. ఎంతో ఎఫెక్ట్ పెట్టి ఈ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించానన్నారు. మెయిన్స్ ఎగ్జామ్స్‌లో రాసే టైమ్‌లో చాలా క్లారిటీగా ప్రశ్న అడిగే తీరు బట్టి సమాధానం ఇచ్చాన్నన్నారు. మెయిన్స్‌లో ఎంత ఎక్కువ రాశాము అనే దాని కన్నా ఎంత అర్థవంతంగా రాసామన్నదే ప్రధానమన్నారు. అలాగే ఇంటర్వ్యూలో చాలా మంచిగా జరిగిందన్నారు.
చదవండి: ఏపీపీఎస్సీ Group 1& 2 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
15 మంది ఐఐటీ అభ్యర్ధులు..
ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి వచ్చిన వాళ్లలో ఉన్నారు. ఎంపికైన వారిలో మొదటి పది స్ధానాలలో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే.
అలాగే గ్రూప్-1 స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష రాసిన కొన్ని ఎస్సే రైటింగ్స్ మీకోసం..
Tags
- APPSC Group-1 First Ranker Bhanusri Lakshmi Annapurna Pratyusha Success Story
- APPSC Group 1 First Ranker 2023 Success Story
- APPSC Group 1 First Ranker 2023 Bhausri Lakshimi Annapurana pratysha story
- Bhanusri Lakshmi Annapurna Pratyusha appsc group 1 ranker family
- Bhanusri Lakshmi Annapurna Pratyusha appsc group 1 ranker education
- Bhanusri Lakshmi Annapurna Pratyusha appsc group 1 inspire story
- Bhanusri Lakshmi Annapurna Pratyusha
- Bhanusri Lakshmi Annapurna Pratyusha news telugu
- Bhanusri Lakshmi Annapurna Pratyusha real story
- Bhanusri Lakshmi Annapurna Pratyusha group1 marks
- appsc group 1 state rankers success stories 2023