Skip to main content

SSC GD Constable: ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుద‌ల‌... మెరిట్‌లిస్ట్ కోసం క్లిక్ చేయండి.!

సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ) నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు ఆగస్టు 20న విడుదలయ్యాయి. ఈ మేరకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆధికారిక ప్రకటన విడుదల చేసింది.
SSC GD Constable
ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుద‌ల‌... మెరిట్‌లిస్ట్ కోసం క్లిక్ చేయండి.!

జులైలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం రోస్ట‌ర్ పాయింట్ల‌ను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. పీఈటీ/ పీఎస్‌టీ ఫలితాలు జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ చేస్తోంది.

ఇవీ చ‌ద‌వండి: 50,187 కానిస్టేబుల్ పోస్టులు.. ఎంపికైతే రూ.69,100 వ‌ర‌కు జీతం..

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను మే నెలలో నిర్వహించింది. 

పోస్టుల వివ‌రాలు ఇలా..
బీఎస్‌ఎఫ్‌లో 21,052, సీఐఎస్‌ఎఫ్‌లో 6060, సీఆర్‌పీఎఫ్‌లో 11169, ఎస్‌ఎస్‌బీలో 2274, ఐటీబీపీలో 1890+3752, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175తో కలిపి మొత్తం 50,187 ఖాళీలున్నాయి.

                                                         ఫ‌లితాల కోసం ఇక్క‌డ్ క్లిక్ చేయండి

ఇవీ చ‌ద‌వండి: పేద బాలికలకు రూ.100 కోట్ల స్కాలర్‌ షిప్

Published date : 21 Aug 2023 02:48PM
PDF

Photo Stories