Infosys: పేద బాలికలకు రూ.100 కోట్ల స్కాలర్ షిప్
మొదటి దశలో 2,000 మంది బాలికలకు స్కాలర్‌షిప్ ఇవ్వనుంది. పేరొందిన విద్యా సంస్థల్లో.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమ్యాటిక్స్ (స్టెమ్) విభాగాల్లో కోర్సులు చేసే, ఆర్థికంగా బలహీన వర్గాల వారు ఇందుకు అర్హులని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది.
ఇవీ చదవండి: అమెరికాలో కొవిడ్ కొత్త వేరియంట్... ప్రపంచాన్ని కలవరపెడుతోన్న బీఏ.2.86
స్టెమ్ స్టార్ స్కాలర్‌షిప్ అన్నది ట్యూషన్ ఫీజులు, నివాస వ్యయాలను చెల్లించడంతోపాటు, రూ.లక్ష వరకు స్టడీ మెటీరియల్ కోసం ఇస్తుంది. ‘‘పేదరికం ఎంతో యువతను విద్యకు దూరం చేస్తోంది. బాలికలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మహిళలు విద్యావంతులు అయితే వారి పిల్లల స్కూలింగ్‌పై సానుకూల ప్రభావం చూపించడాన్ని గమనించొచ్చు. అందుకే స్టెమ్ స్టార్స్ స్కాలర్‌షిప్ కార్యక్రమం ఉన్నత విద్య చదువుకోవాలనే బాలికలకు సాధికారతను కల్పించనుంది’’అని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మాణి తెలిపారు.
ఇవీ చదవండి: APPSC Group 1 Second Ranker 2023 Pavani Success Story