Skip to main content

Covid variant BA.2.86: అమెరికాలో కొవిడ్ కొత్త వేరియంట్‌... ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోన్న బీఏ.2.86

క‌రోనా నుంచి ప్ర‌పంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఈ స‌మ‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(WHO) నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌క‌ట‌న క‌ల‌వ‌ర‌పెడుతోంది. అమెరికాలో కొవిడ్‌ 19కి చెందిన కొత్త రకాన్ని గుర్తించామ‌ని.. ఈ వేరియంట్‌లో భారీ సంఖ్యలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకుంటున్నాయ‌ని డ‌బ్ల్యూహెచ్ఓ తెలిపింది.
Covid variant BA.2.86, covid -19
అమెరికాలో కొవిడ్ కొత్త వేరియంట్‌... ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోన్న బీఏ.2.86

ఇవీ చ‌దవండి: APPSC Group 1 Second Ranker 2023 Pavani Success Story

ప్రస్తుతం దీన్ని ‘వేరియంట్‌ అండర్‌ మానీటరింగ్‌’గా పేర్కొంటున్న‌ట్లు వెల్ల‌డించింది. అమెరికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ను బీఏ.2.86గా గుర్తించారు. దీన్ని అమెరికాతోపాటు డెన్మార్క్‌, ఇజ్రాయెల్‌లోనూ కనుగొన్నారు. దీంతో అప్రమత్తమైన అమెరికా కొత్త వేరియంట్‌ను ట్రాక్‌ చేసే పనిలో నిమగ్నమైంది. కొత్త వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రతను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరమని.. దీనిపై ప్రపంచ దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటున్నట్లు డ‌బ్ల్యూహెచ్ఓ తెలిపింది.

covid

ఇవీ చ‌దవండి: APPSC Group-1 First Ranker Bhanusri Lakshmi Annapurna Pratyusha Success Story 

కొత్త వేరియంట్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ కాక‌పోయినా ప్ర‌పంచ‌మంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని డ‌బ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ ఘెబ్రెయేసస్ సూచించారు. గుజరాత్‌లో జరుగుతోన్న జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్న టెడ్రోస్ మాట్లాడుతూ కొత్తగా వెలుగుచూసిన వేరియంట్‌లో ఎన్నో పరివర్తనాలు ఉన్నాయ‌న్నారు. దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇటువంటి కొత్త వేరియంట్లు ఎత్తిచూపుతున్నాయ‌ని చెప్పారు.  

Published date : 18 Aug 2023 05:06PM

Photo Stories