Inland State Award: తెలంగాణకు ఇన్‌ల్యాండ్ స్టేట్ అవార్డు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రం చేపల పెంపకంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ‘ఉత్తమ ఇన్‌ల్యాండ్ స్టేట్’ అవార్డును అందుకుంది.
ఈ అవార్డు 2024 నవంబర్ 21వ తేదీ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ ద్వారా తెలంగాణకు ప్రదానం చేయబడింది.
ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, మత్స్యశాఖ డైరెక్టర్ ప్రియాంక ఆల, జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణన్‌లు స్వీకరించారు.
తెలంగాణ 2016-17 నుంచి 2023-24 వరకు చేపల ఉత్పత్తిలో విశేష పురోగతి సాధించింది. చేపల ఉత్పత్తి 1.9 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి పెరిగినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును అందజేసింది.
Published date : 23 Nov 2024 09:51AM