Kadapa Steel Plant infrastructure: రూ.650 కోట్లతో కడప స్టీల్‌కు మౌలిక వసతులు
వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లి వద్ద రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న ఈ స్టీల్ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించేలోగా.. రహదారులు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా తదితర కీలక మౌలిక వసతులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ప్లాంట్‌ను ఎన్‌హెచ్67కు అనుసంధానిస్తూ సుమారు రూ.90 కోట్లతో నాలుగు లేన్ల రహదారిని ఏర్పాటు చేస్తోంది.
☛☛ Inorbit Mall in Vizag: విశాఖలో ఇనార్బిట్ మాల్‌కు భూమిపూజ
తొలి దశలో రెండు లేన్ల రహదారిగా నిర్మించి రెండో దశ నాటికి నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే రెండు లేన్ల రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఎర్రగుంట్ల–నంద్యాల ప్రధాన రైల్వే లైన్‌కు ప్లాంట్‌ను అనుసంధానిస్తూ రూ.324 కోట్ల వ్యయంతో రైల్వే లైన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే రైల్వే శాఖకు అందించగా.. ఆ శాఖకు చెందిన అధికారులు వచ్చి సర్వే పూర్తి చేశారు.
ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఈ నెలలో సూత్రప్రాయ ఆమోదం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా కోసం రూ.64.56 కోట్లతో 400 కేవీ/200 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంట్‌కు అవసరమైన రెండు టీఎంసీల నీటిని ఆర్‌టీపీపీ నుంచి పైప్‌లైన్ ద్వారా తీసుకెళ్లడానికి రూ.127 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
☛☛ Software Technology Parks in AP: ఏపీలో 4 సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ కేంద్రాలు