Inorbit Mall in Vizag: విశాఖలో ఇనార్బిట్ మాల్‌కు భూమిపూజ
Sakshi Education
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖపట్టణం కైలాసపురంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహేజా గ్రూప్స్ ఇనార్బిట్ మాల్‌కు భూమి పూజ చేశారు.
ఆణిముత్యంలాంటి ప్రాజెక్టు...
సీఎం జగన్ మాట్లాడుతూ 17 ఎకరాల స్ధలానికిగాను, 12–13 ఎకరాల పెద్ద విస్తీర్ణంలో మాల్ రావడం అన్నది కొన్ని చోట్లే ఉంటుంది. ఇదే రహేజా గ్రూపు హైదరాబాద్‌లో ఇనార్బిట్ మాల్‌ను 7–8 ఎకరాల్లోనే కడితే మనం 12–13 ఎకరాల విస్తీర్ణంతో పెద్ద మాల్‌కు ఇక్కడ శంకుస్ధాపన చేసుకున్నాం అని అన్నారు.
Published date : 02 Aug 2023 04:06PM