Skip to main content

Saagar Kavach in Vizag: విశాఖలో ‘సాగర్‌ కవచ్‌’ కవాతు..

దేశంలో రెండో అతి పెద్ద తీరాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వెంబడి ఉన్న సముద్ర జలాల పరిధిలో సమగ్ర తీర భద్రతపై 2 రోజుల పాటు నిర్వహించనున్న ‘సాగర్‌ కవచ్‌’ కవాతు ప్రారంభమైంది.
Saagar Kavach in Vizag
Saagar Kavach in Vizag

సముద్ర సంబంధిత భద్రతా వ్యవస్థలతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది. 2008 నవంబర్‌ 26న ముంబై ఉగ్రదాడి తర్వాత ప్రతి ఏటా తీరం వెంబడి ఉన్న రాష్ట్రాల్లో సాగర్‌ కవచ్‌ని నిర్వహిస్తోంది. 
భారత నౌకాదళం, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్, స్టేట్‌ మెరైన్‌ పోలీస్, కస్టమ్స్, మత్స్యశాఖ, పోర్టు అథారిటీలు, డీజీఎల్‌ఎల్‌తో పాటు ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు, ఏజెన్సీలు, మారీటైమ్‌ డొమైన్‌లో భాగస్వాములైన ఏజెన్సీలు ఈ సాగర్‌ కవచ్‌లో పాల్గొంటున్నాయి. సముద్ర జలాల్లో ఆయా కేంద్ర, రాష్ట్ర రక్షణ విభాగాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం, విభాగాల వారీగా బలబలాల్ని నిరూపించుకునేలా ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఈ విన్యాసాల్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుండగా.. విశాఖలోని కోస్ట్‌గార్డ్‌ తూర్పు ప్రధాన కార్యాలయం నుంచి సమన్వయ సహకారం జరుగుతోంది. సముద్ర జలాల్లో ఏ చిన్న శత్రు సంబంధిత సమాచారం దొరికినా..పోలీస్‌(100) లేదా కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌కు సంబంధించి 1093 లేదా ఇండియన్‌ కోస్ట్‌గార్డు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1554కి సమాచారం అందించాలని రక్షణ విభాగాలు విజ్ఞప్తి చేశాయి. ​​​​​​​

☛☛​​​​​​​ chandrayyan-3 ready to launch: చంద్రయాన్‌–3 ప్ర‌యోగానికి సిద్దం.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఇవే...

Published date : 13 Jul 2023 03:27PM

Photo Stories